AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

AP Inter Results 2022 released Today. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 22, 2022, 01:03 PM IST
  • నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
  • రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
  • ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు
AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

AP Inter Results 2022 released: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 54 శాతం విద్యార్థులు ఉతీర్ణత పొందగా.. రెండో సంవత్సరంలో 61 శాతంగా ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను www.bie.ap.gov.in, https://examresults.ap.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

మొదటి సంవత్సరం 4,45,604 మంది పరీక్షలు రాయగా.. 2,41,591 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి ఏడాది 54 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 4,23,458 పరీక్షలు రాయగా.. 2,58,449 ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాది ఉత్తీర్ణత శాతం 61. ఇంటర్ ఫలితాల్లో దుమ్ము రేపారు బాలికలు. ఉమ్మడి జిల్లాల్లో అగ్రస్థానంలో కృష్ణా జిల్లా వుంది. కృష్ణా జిల్లాలో 72 శాతం, చివరి స్థానంలో కడప 50 శాతంగా వుంది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు జూన్ 25 నుంచి జూలై 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 

'ఇంటర్ ఫలితాలను విడుదల చేశాం. సీడీ పాస్ వర్డ్ అందుబాటులో ఉంది. మార్చిలో జరగాల్సిన పరీక్షలను మే నెలలో నిర్వహించాచాం. స్పాట్ వాల్యుయేషన్ వేగంగా పూర్తి చేశాం. ఈ పరీక్షల్లో రికార్డ్ స్థాయిల్లో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశాం. మొదటి సంవత్సరం 54, రెండో ఏడాదిలో 61 ఉత్తీర్ణత శాతంగా ఉంది. ఫస్టియర్లో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం పాసయ్యారు. సెకండియర్‌లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం పాసయ్యారు' అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 

2022 మే 6 నుంచి 25 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు 4, 45, 604 మంది. రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు 4, 23,455 మంది. మరోవైపు ఒకేషనల్ పరీక్షలు రాసిన విద్యార్థులు 72,299 మంది. మొత్తంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 9,41,358 మంది.

Also Read: Horoscope Today June 22 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అక‌స్మిక ధ‌న‌ లాభం!

Also Read: Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News