AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఎప్పటిలాగే అధికారిక పోర్టల్ bie.ap.gov.in నుంచే కాకుండా వాట్సప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీ పిల్లల ఫలితాలను వాట్సప్ ద్వారా మీకు చేరనున్నాయి.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసి అప్పుడే 14 రోజులవుతోంది. త్వరలో ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వ సిద్ధమౌతోంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in నుంచి ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చు. దీనికోసం మీక్కావల్సింది ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు. ఏపీలో మార్చ్ 19 నుంచి పరీక్ష పత్రాల వ్యాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 10 వరకూ ఇవి పూర్తవుతాయి. ఆ తరువాత అంటే ఏప్రిల్ 15 నాటికి ఫలితాలు విడుదల కావచ్చు.
మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ ఫోన్‌లో ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 955230009 సేవ్ చేసుకోవాలి. ఆ తరువాత మీ భాషను ఎంచుకోవాలి. ఆ తరువాత సర్వీస్ ఎంచుకోవాలి. ఇందులో ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్‌లో వెళితే అక్కడ మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆప్షన్ ఎంచుకుని మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే చాలు..క్షణాల్లో మీ మార్క్స్ మెమో ప్రత్యక్షమౌతుంది.
Also read: Ramadan 2025 Wishes: అందరికీ ఈద్ ముబారక్, మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









