)
AP liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచనలం. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక పురోగతిని సాధించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన రూ. 11 కోట్ల నగదును హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేసేందుకు ఈ డబ్బును రహస్యంగా దాచారని సిట్ స్పష్టం చేసింది. అయితే ఆ డబ్బుకు సంబ్ధించిన తాజాగా ఓ వీడియో వైరల్ అయ్యింది.
జనాలకు పంపిణీకి సిద్ధం చేసిన నోట్ల కట్టలతో పాటు ఆ వీడియాలో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు ఉన్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. పంపిణీకి వీలుగా ఈ డబ్బును పెట్టెల్లో అమర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తులో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ వీడియో కీలకం కానుంది. ఈ ఒక్క వీడియోతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీమ్ అడ్డంగా దొరికిపోయినట్లు అయ్యింది.
అయితే ఈ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయిన క్రమంలో అతడు దర్యాప్తు అధికారులపై బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో అధికారులపై వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడీ వీడియో ఆయన అనుచరలు ఉండడం పట్ల తాను ఎలా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook