AP Liquor Scam: లిక్కర్‌ దొంగల బట్టలు సగమే విప్పారు.. నా పాత్ర విజిల్‌ బ్లోయర్‌: విజయ్‌ సాయిరెడ్డి

Vijaya Sai Reddy Tweet On AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌పై విజయ సాయిరెడ్డి సంచలన ట్వీట్‌ పెట్టారు. ఈ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్‌ మాత్రమే అని చెప్పారు. రూపాయి నేను ముట్టుకోలేదు లిక్కర్ దొంగలు బట్టలు సగమే విప్పారు. మిగతా బట్టలు విప్పేందుకు సహకరిస్తానన్నారు. 

Written by - Renuka Godugu | Last Updated : Apr 22, 2025, 11:19 AM IST
AP Liquor Scam: లిక్కర్‌ దొంగల బట్టలు సగమే విప్పారు.. నా పాత్ర విజిల్‌ బ్లోయర్‌: విజయ్‌ సాయిరెడ్డి

Vijaya Sai Reddy Tweet On AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్‌ పెట్టారు. ఈ స్కామ్‌లో నా పాత్ర కేవలం విజిల్‌ బ్లోయర్ మాత్రమే. తప్పించుకునేందుకు దొరికిన దొంగలు.. దొరకని దొంగలు నా పేరు లాగుతున్నారు. నేను రూపాయి కూడా ముట్టుకోలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. పూర్తిగా విప్పితేనే కదా తెలిసేది అని విజయసాయిరెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు 

Add Zee News as a Preferred Source

ఇటీవల విజయసాయిరెడ్డి విచారణ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆయనను లిక్కర్ స్కామ్‌పై  మూడు గంటలకు పైగా ప్రశ్నించింది సీట్‌. ఈ కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి ముందస్తుగా నోటు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. సీట్ ఇందులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సాక్షిగా ప్రశ్నించేందుకు విచారణకు పిలిచింది. విజయవాడ సిట్ కార్యాలయంలో ఈ విచారణ పూర్తయింది. అయితే లిక్కర్ స్కాంలో డబ్బులు ఎలా ఈ వాడుకున్నారని అడగ్గా లోన్ మాత్రం ఇప్పించాను.. ఫండ్స్ ఎలా వాడుకున్నారు తనకు తెలియదని విజయసాయిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది .

అయితే నేడు ఈ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత ఆయనని విజయవాడ కూడా తరలించే పనిలో ఉన్నారు. దుబాయ్ నుంచి వస్తున్న కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే గత ప్రభుత్వం హయాంలో లిక్కర్ సంబంధించిన భారీ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం చెబుతోంది .

దాదాపు రూ.18,860 కోట్ల అక్రమాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా లిక్కర్ పాలసీ, ట్రాన్స్‌పోర్ట్ టెండర్స్ విషయంలో ఈ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర అని సీట్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చింది. 

 

 

ఇదిలా ఉండగా కసిరెడ్డి హైకోర్టుకు బెయిల్ పిటిషన్ అప్పీల్ చేసుకున్నారు. దీనిపై విచారణకు హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే సీట్ విచారణకు తాను హాజరవుతున్నట్లు వాయిస్ రికార్డ్ కూడా కసిరెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు. ఈరోజు ఎయిర్‌ పోర్టులో అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఏపీకి తరలిస్తున్నారు. రేపు మెజిస్ట్రేట్ ముందు కసిరెడ్డిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కసిరెడ్డిని పోలీసులు కస్డడీ అడిగే అవకాశం ఉంది. ఈ విచారణలో ఎవరి పేర్లు బయట పెడతారనేదే కీలక అంశంగా మారింది.

ఇదీ చదవండి: రైలులో నెయ్యి తీసుకువెళుతున్నారా? మీరు ఈ నియమాలను తెలుసుకోవాలి..  

ఇదీ చదవండి: నటి జెత్వాని వేధింపుల కేసు.. ఐపీఎస్‌ సీతా రామాంజనేయులును అరెస్టు చేసిన ఏపీ పోలీసులు..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News