
Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల సందడి మొదలుకాబోతోంది. 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. మూడు నెలల ముందుగానే ఈ ఎన్నికల కోసం ఏర్పాట్లు ప్రారంభించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం 2026 ఏప్రిల్‌లో.. నగరపాలక మరియు పురపాలక సంస్థల కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం 2026 మార్చిలో ముగుస్తుంది.
సాధారణంగా ఈ ఎన్నికలు మే, జూన్ నెలల్లో జరగాల్సి ఉన్నా, రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు నెలల ముందుగానే 2026 జనవరిలో వీటిని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులకు సూచించారు.
అక్టోబర్ 15 నాటికి వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 మధ్య వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబర్ 1 నుంచి 15 మధ్య ఎన్నికల అధికారుల నియామకం జరగాలి. నవంబర్ 16 నుంచి 30 వరకు పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల ఏర్పాటు పూర్తి చేయాలి. డిసెంబర్ 15 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెలలో ఫలితాలను ప్రకటించాలని ఎన్నికల సంఘం పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook