AP Mega DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్ ఏపీ డీఎస్సీ ప్రకటనకు రంగం సిద్ధం అయిపోయింది. ఎన్నో రోజులుగా లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. నేడు ఎదురు చూపులకు తెరపడనుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం డీఎస్సీ వయోపరిమితి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. ఈనేపథ్యంలో ఈరోజు ఆదివారం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ మంత్రి లోకేష్ శుభవార్త చెప్పారు.
ఇక అధికారిక వెబ్‌సైట్ అయిన https://cse.ap.giv.in, https://apdsc.apcfss.in డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు. టీచర్ల నియామకం ద్వారా స్కూళ్ల సాధికారత సాధించడంలో ఇదొక చారిత్రాత్మక ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందరికీ ఆయన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 పోస్టులకు ఇవాళ పది గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, స్టేట్ జోన్ లెవెల్ 2259, సెకండరీ టీచర్ గ్రేడ్ ఖాళీలు 6599, 13 ఉమ్మడి జిల్లాల సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఉన్నాయి.
ఇక కూటమి సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఈ ఉపాధ్యాయుల పోస్టుల పర్తికి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం సంబంధిత జీవోలు ఖాళీల వివరాలు, షెడ్యూల్, సిలబస్ వంటి వివరాలు కోసం అధికారిక వెబ్‌సైట్లో ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. కుంభ రాశి ఖర్చుపై కంట్రోల్ ఉండాలి.. మేషం వారికి ధనలాభం..
ఏపీ డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15 వరకు జరగనుంది. ఇక మాక్ టెస్టులు మే 20 నుంచి నిర్వహిస్తారు.
మే 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తారు .
ప్రాథమిక కీ అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజు అందుబాటులో ఉంచుతారు.
ఫైనల్ కీ అభ్యంతరాలు ముగిసిన వారం తర్వాత విడుదల చేస్తారు.
ఇక చివరగా మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు.
ఇదీ చదవండి: Potassium: ఈ 5 పండ్లలో పొటాషియం పుష్కలం.. ఎండవేళ తింటే ఎంతో ఆరోగ్య కరం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









