)
Ap Minister Vasamsetti Subhash controversy comments on brs kcr: తెలంగాణలో ప్రస్తుతం జూబ్లిహిల్స్ బై పోల్స్ ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎక్కడ అవకాశం దొరికిన కూడా బీఆర్ఎస్ ను ఏకీపారేస్తుంది. మరోవైపు కల్వకుంట్ల కవిత కూడా బీఆర్ఎస్ పార్టీపై, కేటీఆర్, హరీష్ రావులను ఏకీపారేస్తుంది. ఇక మరోవైపు ఇటీవల హైదరాబాద్ లో రామోజీ రావు జయంతి వేడుకల నేపథ్యంలో రెండు తెలుగు స్టేట్స్ ల సీఎంలు కూడా ఒక వేదికమీద కన్పించారు.
అంతేకాకుండా ఇద్దరు చాలా క్లోజ్ గా జోకుల్ వేసుకుంటూ గురు, శిష్యులు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనిపై బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ పార్టీ కొంత జలసీగా ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. శెట్టి బలిజలుగా పుట్టి కొంత మంది బంధువులు హైదరాబాద్ వెళ్లారన్నారు. అంతటితో ఆగకుండా... ఆ టీఆర్ఎస్ గద్దముక్కుపంతులు అంటూ మాజీ సీఎం కేసీఆర్ ను పట్టుకుని శెట్టి బలిజలను ఓసీలలో చేర్చాడని వ్యాఖ్యానించారు. వందల జీవితాలు నాశనమౌతున్నాయన్నారు.
దీని వల్ల భావితరాలు నాశనమౌతున్నాయన్నాడు. మన నాయకులుదీనిపై పోరాడుతున్నారన్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి వాసం శెట్టి సుభాష్ చేసిన కామెంట్స్ కు వైరల్‌గా మారాయి. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు మండి పడుతున్నారు. ఒక మాజీ సీఎంను పట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని ఏపీ మంత్రిని ఏకీపారేస్తున్నారు. మొత్తంగా ఈ అంశం ప్రస్తుతం కాంట్రవర్సీగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి