)
AP MLC Elections: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరఫున పోటీచేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. పోటాపోటీగా సాగిన ఎన్నికలో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన గెలుపొందారు.ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరివరకు ఉత్కంఠగా సాగింది. ఈ ఎన్నికల్లో పదిమంది బరిలో ఉన్నా.. పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులునాయుడు, పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి, ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ మధ్యే పోటీ నెలకొంది.
నువ్వానేనా అన్నట్లు పోటీ సాగగా ఆఖరుకు రఘువర్మను ఎలిమినేట్ చేశారు. మొత్తం పోలైన ఓట్లు 20,791 అయితే చెల్లిన ఓట్లు 20,135. ఇందులో 10,068 ఓట్లతో మేజిక్ ఫిగర్ ను అందుకోవాల్సి ఉండగా గాదెకు 12,035 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన గెలిచినట్లు ప్రకటించి సర్టిఫికెట్ ఇచ్చారు.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండు ముగిసేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 28వేల ఓట్లకు గాను ఆయన 16,520 ఓట్లు సాధించగా, స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 5,815 ఓట్లు వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe