MLC Elections in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మొత్తం ఐదు సీట్లకు గానూ మార్చి 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, పర్చూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బి.తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీకాలం మార్చితో ముగియనుంది. అయితే ఈసారి ఐదు సీట్లు కూడా కూటమి పార్టీల ఖాతాల్లోకే వెళ్లనున్నాయి. దాంతో మూడు పార్టీలకు సంబంధించిన నేతలు ఎమ్మెల్సీ పదవిని దక్కించేందుకు లాబీయింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో జనసేన, బీజేపీకి ఒక్కో సీటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటింది. ఇప్పటికే దాదాపు అన్ని కార్పొరేషన్లలో పదవులు భర్తీ జరిగింది. అప్పట్లో కొందరు నేతలు నామినేటేడ్ పోస్టులు ఇస్తామని హైకమాండ్ ఆఫర్ చేసినా తిరస్కరించారు. ఇప్పుడు వారంతా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలని ఆశపడుతున్నారు. ఇందులో టీడీపీలో నెంబర్ టుగా కొనసాగుతున్న యనమల రామకృష్ణుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలోనే ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయనకు అందరూ ఊహించినట్టుగా మంత్రి పదవి దక్కలేదు. కానీ కూతురు దివ్య మాత్రం తుని ఎమ్మెల్యే అయ్యారు. అటు మరో అల్లుడు ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు ఓ సీటు యనమలకు ఖాయమైందనే ప్రచారం సాగుతోంది..
ఇక తెలుగుదేశం పార్టీలోనే మరో లీడర్ దేవినేని ఉమ మహేశ్వర రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవినేని ఉమకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు.. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్‌కు టికెట్ ఇవ్వడంతో దేవినేని ఉమ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఒకవేళ ఉమకు పదవి దక్కని పక్షంలో ఆయన కుమారుడికైనా పదవి ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది. మరో నేత మోపిదేవి వెంకట రమణ ఇటీవల పార్టీ మారారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆయన వైసీపీ నుంచే జంప్ చేశారు. అప్పట్లోనే మోపిదేవిని రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. కానీ మోపిదేవిని పెద్దల సభకు పంపకుండా ఎమ్మెల్సీని చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారట. వీలైతే మోపిదేవికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది..
ఇదిలా ఉంటే పిఠాపరంలో ఎస్వీఎస్‌ఎన్ వర్మది మరో స్టోరీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో.. వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వర్మకు కీలక పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ ఇప్పటివరకు ఆ పదవుల ఊసే లేదు. దాంతో వర్మకు ఈసారి పోస్టు ఖాయమని అంటున్నారు. మరోవైపు రాయలసీమకు చెందిన ఓ ముఖ్య నేతకు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కనుందని సమాచారం. కడపలో ఈ నేతకు పోస్టు ఇవ్వడం ద్వారా జగన్‌కు చెక్ పెట్టినట్టు అవుతుందని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారని తెలిసింది.
మరోవైపు ఓ సీటును జనసేనకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు పెద్దల సభకు వెళ్లడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే మెగా బ్రదర్‌ను తన కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇటీవల పవన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నాగబాబును ముందు ఎమ్మెల్సీని చేశాకే మంత్రి పదవిని కట్టబెట్టబోతున్నట్లు చెప్పారు. ఇద్దరు చెప్పారు కాబట్టి.. ఓ సీటు మాత్రం జనసేన ఖాతాలోకి వెళ్లడం ఖాయం.. అయితే ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్యను పంపడంతో ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అవకాశాలు దాదాపు లేనట్టేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
Also Read: MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు
Also Read: Prabhas: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. రాజా సాబ్ మూవీ కంటే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









