Nagababu: పిఠాపురంలో జనసేన బిగ్ ప్లాన్.. నాగబాబు ఎంట్రీతో వాళ్లకు చెక్ పడినట్టేనా..

Nagababu: ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీ అయిన నాగబాబు అపుడే తన రాజకీయాలకు పదను పెడుతున్నారు. ముఖ్యంగా తన తమ్ముడు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ ప్రతినిధ్యం వహిస్తూన్న పిఠాపురం బాధ్యతలను ఈయన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలతో ఇకపై తరుచుగా సమావేశాలు నిర్వహించనున్నారట.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 4, 2025, 08:25 AM IST
Nagababu: పిఠాపురంలో  జనసేన బిగ్ ప్లాన్.. నాగబాబు ఎంట్రీతో వాళ్లకు చెక్ పడినట్టేనా..

Nagababu: ఎమ్మెల్సీగా ఎన్నికైన మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు పిఠాపురంలో నేడు, రేపు  పర్యటించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. అక్కడ చేపడుతున్న పలు  అభివృద్ధి  కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత, పవన్ కల్యాణ్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కావడంతో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు, ఆయన శాఖలకు సంబంధించిన సమీక్షలు, సమావేశాలతో ఆయన నిత్యం బిజీగా ఉంటున్నారు.

Add Zee News as a Preferred Source

దీంతో సొంత నియోజకవర్గం పిఠాపురం బాధ్యతలను నాగబాబుకు అప్పగిస్తారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఇందుకు సంబంధించిన లైన్ క్లీయర్ అయ్యింది. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనే అవకాశం ఆయనకు దక్కింది.

మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీతో పిఠాపురం రాజకీయాలు మారబోతున్నాయా అంటే ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు పిఠాపురంతో పాటు ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలను ఇకపై నాగబాబే స్వయంగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు పిఠాపురానికి సంబంధించి పూర్తి బాధ్యతలు కూడా ఈయన చూసుకోనున్నారు. త్వరలో నాగబాబు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒకవేళ నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఏపీ క్యాబినేట్ లో ఒకే ఇంటి నుంచి తండ్రి కొడుకులుగా చంద్రబాబు, లోకేష్ లు ముఖ్యమంత్రి, మంత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత ఒకే ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా.. నాగబాబు మంత్రిగా ఉండనున్నారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News