Andhra Pradesh New Districts Full List: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 13 నుంచి 26 జిల్లాలకు పెంచగా.. తాజాగా కూటమి ప్రభుత్వం ఆయా ప్రాంతాల ప్రజల డిమాండ్స్ మేరకు మరిన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. 26 జిల్లాల నుంచి 32 కు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరుపుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో నియోజకవర్గాలు అటు ఇటు మార్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు NTR జిల్లాలో మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజధాని అమరావతితోపాటు మార్కాపురం, గూడూరు, ఆదోని, మదనపల్లి, పలాస జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడంతోపాటు పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. త్వరలోనే మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి.. తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కొత్త జిల్లాలు-అసెంబ్లీ నియోజకవర్గాలు ఇలా ఉండే ఛాన్స్..
==> అమరావతి జిల్లా (Amravati District): పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ.
==> మార్కాపురం (Markapur): మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి.
==> ఆదోని (Adoni): ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం.
==> మదనపల్లి (Madanapalle): మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి.
==> గూడూరు (Gudur): గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట.
==> పలాస (Palasa): ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం.
కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మిగిలిన జిల్లాలు-నియోజకవర్గాలు
==> కర్నూలు (Kurnool): కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు
==> నంద్యాల (Nandyal): నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం.
==> సత్యసాయి హిందూపురం (Sri Sathya Sai): హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర.
==> అనంతపురం (Anantapur): అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి.
==> YSR కడప (YSR Kadapa District): కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల.
==> అన్నమయ్య రాజంపేట (Annamayya): రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు
==> శ్రీ బాలాజీ తిరుపతి (Tirupati): తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి.
==> చిత్తూరు (Chittoor): చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం.
==> ఒంగోలు (Ongole): ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు.
==> శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore): నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావాలి, కోవూరు, ఉదయగిరి.
==> గుంటూరు Guntur (District): గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు.
==> బాపట్ల (Bapatla): బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు.
==> పల్నాడు (Palnadu): నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ.
==> కృష్ణా (Krishna): కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు.
==> ఎన్టీఆర్ (NTR): విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం.
==> పశ్చిమ గోదావరి (West Godavari): తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం.
==> ఏలూరు (Eluru): ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం.
==> తూర్పు గోదావరి (East Godavari): రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం.
==> BR అంబేద్కర్ కోనసీమ (Dr.B.R.Ambedkar Konaseema District): అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట.
==> కాకినాడ (Kakinada): కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం.
==> విశాఖపట్నం (Visakhapatnam): భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి.
==> అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju): అరకు, పాడేరు, మాడుగుల.
==> అనకాపల్లి (Anakapalle): అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని.
==> విజయనగరం (Vizianagaram): విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి.
==> మన్యం పార్వతీపురం (Parvathipuram Manyam): పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ.
==> శ్రీకాకుళం (Srikakulam): శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం.
Also Read: Telangana Govt: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ అప్డేట్.. ఇకపై ఆన్‌లైన్ లోనే అప్డేట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









