)
AP NTR Bharosa Pension Latest News: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని భారీ ఎత్తున చేపడుతుంది. వృద్ధులతో పాటు దివ్యాంగులు, తలసేమియా బాధితులు, వితంతువులు సహా ఇలా దాదాపుగా 26 వర్గాల వారికి ఇలా ప్రతినెలా పెన్షన్ అందజేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకంలో అందజేస్తున్న పెన్షన్ కనీసం రూ.4,000 నుంచి అత్యధికంగా రూ.15,000 వరకు అందజేస్తున్నారు. అయితే ఈ పెన్షన్ పథకానికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతుంది.
నవంబరు నెలలో దాదాపుగా 63 లక్షల 38 వేల 744 మందికి (63,38,744) పెన్షన్ అందజేయగా.. 1,74,701 మందికి మాత్రం ఎలాంటి పెన్షన్ ఇవ్వలేదు. అయితే వారంతా అందుబాటులో లేరా? చనిపోయారా? లేరా అనర్హుల జాబితాలో ఉన్నారా? అనే విషయంపై స్పష్టత రాలేదు. అదే విధంగా డిసెంబరు 1 తేదీన అనగా నేడు మొత్తం 63,25,999 మందికి పెన్షన్ అందజేయాల్సి ఉండగా.. గత నెలతో పోలిస్తే 12,745 తగ్గుదల మాత్రమే కనిపించింది. ఈ క్రమంలో వారి పెన్షన్ గురించి ప్రశ్నార్థకంగా మారింది.
ఆ విధంగా గతంలో పెన్షన్ అందజేయకుండా ఉన్న వారిలో 12,745 మందిని తీసేయగా.. మిగిలిన 1,61,956 మంది అందుబాటులో ఉన్నట్లే తెలుస్తోంది. అంటే వీరందరికి పెన్షన్ కట్ చేసినట్లే అని సమాచారం. అయితే ప్రతినెలా పెన్షన్ అందజేయాల్సిన వారి సంఖ్య ఎందుకు తగ్గుతుందనే అనుమానాలు చాలా మందిలో రేకెత్తుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకునే సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో పెన్షనర్ల సంఖ్య 66,34,372 ఉండగా.. ఇప్పుడు అది 63,25,999కు చేరింది. అంటే 3,08,373 మందికి పెన్షన్ నిలిపేసినట్లు తెలుస్తోంది.
అయితే పెన్షన్ పంపకంలో తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. కానీ, కొందరు ఇప్పటికీ పెన్షన్ పంపిణీలో పాల్గొనకపోవడంపై వారిపై సీఎం గరంగా ఉన్నారు. సదరు మంత్రులు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook