)
Pensions In AP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రభుత్వం పింఛన్లను తిరిగి పరిశీలించే ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యంగా దివ్యాంగులు.. ఆరోగ్య కేటగిరీ పింఛన్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో.. కొత్త ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో అర్హత లేని వారు కూడా పింఛన్లు పొందుతున్నారని గుర్తించి..ఇప్పుడు అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనం అందేలా చర్యలు చేపట్టింది.
గత ప్రభుత్వ హయాంలో పింఛన్ పంపిణీ వ్యవస్థలో కొన్ని తప్పులు చోటుచేసుకున్నాయి. కొంతమంది అర్హత లేని వారు కూడా దివ్యాంగుల పింఛన్ పొందుతున్నారని తేలింది. అందుకే ప్రభుత్వం ఈసారి ప్రతి దివ్యాంగుడి వైకల్యం శాతం నిజంగా 40% పైగా ఉందా లేదా అన్నది వైద్యపరంగా నిర్ధారించాలని నిర్ణయించింది. దీనికోసం జిల్లా వారీగా వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.
అర్హత లేని వ్యక్తులకు ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. అయితే.. మానవీయ దృక్పథంతో ప్రభుత్వం వారికి మరో అవకాశం ఇచ్చింది. మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకుని తమ అర్హతను నిరూపించుకునే అవకాశం కల్పించింది. గ్రామ.. వార్డు సచివాలయ సిబ్బంది, డీఆర్డీఏ అధికారులు ఈ వివరాలను సంబంధిత పింఛనుదారులకు తెలియజేస్తున్నారు.
Andhra Pradesh Pension Latest Update: వైద్య పరీక్షలు ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. రోజుకు సగటున 100 నుంచి 130 మంది వరకు పరీక్షలు చేయించుకుంటున్నారు. పరీక్షలు ‘జంబ్లింగ్ పద్ధతిలో’ జరుగుతున్నాయి అంటే.. ఎవరు గతంలో ఎక్కడ పరీక్ష చేయించుకున్నారో.. ఈసారి వేరే ఆసుపత్రిలో చేయించుకోవాలి.
వైద్య బృందాలు ప్రతి అభ్యర్థి వైకల్యం శాతాన్ని ఖచ్చితంగా పరిశీలించి నివేదికలు తయారు చేస్తున్నాయి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారి పింఛన్లు రద్దు చేస్తారు. అయితే..వారు 60 ఏళ్లు దాటినట్లయితే, వారికి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేస్తారు. అన్ని వివరాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మరియు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు.
Government Pension Verification Rules: పరీక్షలు.. పత్రాల ధృవీకరణ ప్రక్రియ మూడు నెలల వరకు కొనసాగనుంది. దీని తర్వాతే తుది జాబితా సిద్ధమవుతుంది. ఈ విధానం ద్వారా నిజమైన అర్హులైన పింఛనుదారులు మాత్రమే ప్రభుత్వ సహాయం పొందుతారని అధికారులు చెబుతున్నారు.
వైద్య పరీక్షలకు హాజరుకాని వారు లేదా పత్రాలు సమర్పించని వారు పింఛన్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి నోటీసు అందుకున్న ప్రతి ఒక్కరూ సమయానికి హాజరు కావడం చాలా ముఖ్యం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.