Pawan Kalyan Son: పవన్ కొడుకు హెల్త్‌పై జుగుప్సాకరమైన పోస్టులు.. ఏపీ పోలీసులు సీరియస్..

Mark Shankar: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ లోని స్కూళ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో కొంత మంది నీచులు సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 11, 2025, 12:38 PM IST
  • పవన్ కొడుకుపై ట్రోలింగ్..
  • సీరియస్ అయిన ఏపీ పోలీసులు..
Pawan Kalyan Son: పవన్ కొడుకు హెల్త్‌పై జుగుప్సాకరమైన పోస్టులు.. ఏపీ పోలీసులు సీరియస్..

Ap police serious on controversy posts on pawan kalyan son: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కూటమి సర్కారు సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులపై సీరియస్ అయ్యింది. పార్టీలకతీతంగా మహిళల్ని కించపర్చే విధంగా ఎవరు మాట్లాడిన తాట తీస్తామని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో మాజీ సీఎం సతీమణి వైఎస్ భారతపై కాంట్రవర్సీగా మాట్లాడినందుకు ఏపీ పోలీసులు.. చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Add Zee News as a Preferred Source

మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం పై కొంత మంది సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారు. ఏకంగా రెండు సోషల్ మీడియా అకౌంట్ లలో పవన్ తనయుడు మార్క్ శంకర్ ఇక లేరని .. రిప్.. అంటూ పోస్ట్ లు చేశారు. ఇది కాస్తవైరల్ కావడంతో దీనిపై జనసేన అభిమానులు, మెగా ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. దీనిపై ప్రత్తిపాడు, విజయవాడలో పీఎస్ లలో ఫిర్యాదులు చేశారు.ఈ మేరకు పోలీసులు రెండు కేసుల్ని నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు చాలా సీరియస్ గా విచారణ ప్రారంభించారు.

చిన్న పిల్లలపై ఇలాంటి వ్యాఖ్యల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు టెక్నికల్ టీమ్ సపోర్ట్ తీసుకుని.. సదరు సోషల్ మీడియా అకౌంట్  హోల్డర్ లను పట్టుకునే పనిలో పడ్డారు.  ఈ ఘటనను మెగా అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Read more: Vijay Devarakonda: ఆంటీ మీకూ ఇంట్రస్టింగ్‌ రీల్స్‌ పంపిస్తా: హీరో విజయ్‌ దేవరకొండ..

నిందితులను వదిలేదిలేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. పూర్తిగా కొలుకొవడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చని చిరంజీవి తన కొడుకు హెల్త్ అప్ డేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమకులదైవం ఆంజనేయ స్వామి దయవల్ల మార్క్ శంకర్ గండం నుంచి గట్టేక్కాడనికూడా చెప్పుకొచ్చారు. తమ కోసం ప్రార్థనలు చేస్తున్న అభిమానులకు ప్రత్యేకంగా మెగాస్టార్ ధన్యవాదాలు తెలిపారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News