Nara Lokesh Redbook: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ లీడర్ల అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతోంది. గత ప్రభుత్వంలో ఎవరైతే ఇష్టారాజ్యంగా మాట్లాడారో, వ్యక్తిగతంగా టార్గెట్ చేశారో గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల వైసీపీకి చెందిన వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా పోసాని కృష్ణమురళికి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చారు. ఆయన్ను కూడా రేపోమాపో అరెస్టు చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెడ్ బుక్‌లో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పేరు ఉందని స్వయంగా నారా లోకేష్ వెల్లడించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రశేఖర్ రెడ్డిని అప్పట్లో టార్గెట్ చేశారు. కాకినాడ నగరంలోని బాలాజీ చెరువు సెంటర్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో చంద్రశేఖరరెడ్డిని సంకెళ్లు వేసి నడిపిస్తానంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ద్వారంపూడిని టార్గెట్ చేసింది. కాకినాడలో ద్వారంపూడికి కుటుంబానికి చెందిన అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ద్వారంపూడి ఫ్యామిలీ, బంధువులకు సంబంధించిన రైస్ మిల్లులు, గొడౌనుల పై దాడులు చేశారు. స్వయంగా ఇందులో చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయం ఉందని పౌరసరఫరాల శాఖమంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటించారు. కొంతకాలానికి బ్యాంకు గ్యారంటీ పేరిట వాటిని రిలీజ్ చేయడం కూడా జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీలను కూడా సీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా వైసీపీకి చెందిన వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిని వరుస పెట్టి అరెస్టుల పర్వాన్ని ప్రారంభించింది. ఇక తదుపరి అరెస్టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదేనని ప్రచారం జరుగుతోంది.
గతంలో చంద్రశేఖరరెడ్డి కాకినాడలో జరిగిన సభలో చంద్రబాబును పరుష పదజాలంతో దూషించారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి దూషించిన వారిలో కూడా ద్వారంపూడి ఉన్నారని వార్తలు వచ్చాయి. అదేవిధంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేసేవారు. అటు పవన్ కళ్యాణ్ కైతే బహిరంగ సవాల్ కూడా విసిరారు. దమ్ముంటే నాపై పోటీ చేయి లేకపోతే రాజీనామా చేయి అన్నారు. అంతటితో సరిపెట్టకుండా వారి కుటుంబాల గురించి కూడా కామెంట్లు చేశారు. దీంతో రెడ్ బుక్ లో ద్వారంపూడి పేరు బయటికి వస్తుందా అన్న చర్చ మొదలైంది. మూడు నెలల క్రితమే చంద్రశేఖర్ రెడ్డిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ భవనాన్ని కూలగొడుతున్న సందర్భంలో తమ విధి నిర్వహణను అడ్డుకున్నారంటూ కాకినాడ కార్పొరేషన్ అధికారులు పెట్టిన కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తర్వాత గొడౌన్ సీజ్ జరిగింది. ఆయన ఫ్యాక్టరీలను మూసివేశారు. ఈ వరుస పరిణామాలన్నీ ద్వారంపూడిని కటాకటాల వెనక్కి నెట్టడం ఖామయనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం వైసీపీ క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఫ్యాన్ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన కుటుంబానికి బియ్యంతో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే వివరణ ఇచ్చారు. అక్రమ భవనం కూల్చివేసిన కేసుకు సంబంధించి కాకినాడలోఇలాంటి అక్రమ భవనాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కూల్చండి అని హెచ్చరించారు. దీనికి తోడు కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు, చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఇప్పటికీ సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. అయితే చంద్రశేఖర్ రెడ్డికి జనసేనకి చెందిన ఓ ఎమ్మెల్యే లోపాయికారీగా సపోర్ట్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ద్వారంపూడి పై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రెడ్ బుక్ ఓపెన్ అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేక జనసేన ఎమ్మెల్యే మద్దతుతో ఆయన పేరు కనుమరుగవువుతుందా అనే అనుమానాలు సైతం వస్తున్నాయి. మొత్తంగా ద్వారంపూడి అరెస్టు కాకినాడ జిల్లా కేంద్రంలో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
Also Read: Ramadan Importance: రంజాన్ ప్రాముఖ్యత ఏంటి, ఉపవాసాలు ఎందుకు ఉంటారు
Also Read: Kannappa Teaser: కన్నప్ప టీజర్.. ప్రభాస్ లుక్ హైలెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









