Rain Alert: ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయల అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో రాబోయే మూడు రోజులు పాటు వానలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ శాఖ తెలియజేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు, కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇక నిన్న అనకాపల్లి జిల్లా రావికమంతం వైఎస్సార్ కడప జిల్లావేంపల్లిలో41.4 విజయనగరం జిల్లా గుర్లాలో41.2 తూర్పుగోదావరి జిల్లా మురమండ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలతో ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగబగతో ఆ ప్రజలందరూ కూడ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదివారం రోజు ఆటవిడుపుగా బయటకు వద్దాం అన్నా గాని బయటికి రాలని ఆ పరిస్థితులు నెలకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆ 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఎండవేడితో పాటు వడదెబ్బకు పలువురు కన్నుమూసిన ఘటనలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న ప్రతి అరగంటకు ఒకసారి దాహం వేయకపోయినా..పిల్లలతో నీళ్లు తాగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు ఎండలు మండతున్న సమయంలో నీటి ఆవిరికి ఆకాశంలో మేఘాలు ఏర్పడటం.. దాని కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. .
మరోవైపు వర్షం పడిన మరుసటి రోజే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు ఎక్కడా తగ్గడం లేదు. భారీ వర్షాలు పడకపోయినా సరే కొంత మేరకు జల్లులు పడే అవకాశాలున్నాయి. దీంతో కొంతలో కొంతైన వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









