Summer Heat Waves: తెలంగాణలో ఎండలు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతేకాదు రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. ఈ సందర్భంగా అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకునేందుకు విపత్తు నిర్వహణ సంస్థతో సహా సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వాయవ్య గాలుల ప్రభావంతో రాయలసీమలో ఎండల తీవ్రత పెరిగింది. దేశంలోనే అత్యధికంగా గురువారం అనంతపురంలో 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 49 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ రోజు శనివారం అల్లూరి జిల్లా చింతూరు, మన్యం జిల్లా సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక వైఎస్సార్, నంద్యాల , ప్రకాశం , పల్నాడు జిల్లాల్లో ఆదివారం చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడకూడదని సూచించింది.
వడగాల్పుల నుంచి ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS వంటి పానీయాలు పానీయాలు, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









