Group 2 Mains Results: ఏప్రిల్ మొదటి వారంలోనే గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు, ఎలా ఎక్కడ చెక్ చేసుకోవాలి

Group 2 Mains Results: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎప్పుడు విడుదల కానున్నాయో వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2025, 11:57 AM IST
Group 2 Mains Results: ఏప్రిల్ మొదటి వారంలోనే గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు, ఎలా ఎక్కడ చెక్ చేసుకోవాలి

Group 2 Mains Results: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్ పరీక్ష ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. ఏపీపీఎస్‌సి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రైమరీ కీ విడుదల కాగా మరో 4-5 రోజుల్లో ఫలితాలు రానున్నాయి. గ్రూప్ 2 మెయిన్స్ రాసిన అభ్యర్ధులు తమ ఫలితాలను ఏపీపీఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. 

Add Zee News as a Preferred Source

ఏపీపీఎస్‌సి షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 92,250 మంది దరఖాస్తు చేసుకోగా 86,459 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 92 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన అభ్యర్ధులు వివిధ కారణాలతో పరీక్షకు హాజరు కాలేదు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23న సజావుగా పరీక్ష పూర్తయింది. గ్రూప్ 2 నోటిఫికేషన్‌లోని రోస్టర్ విధానంలో పొరపాట్లు జరిగాయని కొందరు అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పరీక్షలకు ముందు పెద్దఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. రోస్టర్ విధానంలో తప్పుల్ని సరిచేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్‌లో చెప్పినట్టుగా జీవో 77 అమలు చేస్తామని ఉన్నా మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయడాన్ని వ్యతిరేకించారు. 

దీనిపై కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించగా రోస్టర్ విధానం సరి చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలిచ్చింది. అయినా ప్రభుత్వం కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి పరీక్ష నిర్వహించిందని అభ్యర్ధులు నిరసన వ్యక్తం చేశారు. అందుకే అప్పటి నుంచి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాల విషయంలో అస్పష్టత ఉంది. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వస్తోంది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీపీఎస్‌సి. ఈ ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా విడుదల కానుంది. ఫలితాల కోసం https://portal-psc.ap.gov.in/ సంప్రదించాల్సి ఉంటుంది. 

వాస్తవానికి 899 పోస్టుల భర్తీకై 2023 డిసెంబర్7న గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఆ తరువాత మెయిన్స్ పరీక్ష 2024 అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆగిపోయింది. కూటమి అధికారంలో వచ్చాక షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఆగిపోయిన మెయిన్స్ పరీక్షను ఇటీవల ఫిబ్రవరి 23న నిర్వహించింది.

Also read: Heavy Rainfall Alert: ఎండల నుంచి ఊరట, ఏపీ, తెలంగాణలో 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News