APPSC Exams Hall Tickets: ఏపీపీఎస్సీ 2023, 2024లో విడుదలన చేసిన వివిధ నోటఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు మార్చ్ 25న నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌తోపాటు హాల్ టికెట్లు కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ప్రకారం ఏయే ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు, హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఏపీపీఎస్సీ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీ నిమిత్తం జారీ చేసిన వివిధ నోటిఫికేషన్లలో భాగంగా మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నుంచి అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకు 2024 మార్చ్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ఈ ఏడాది మార్చ్ 25న ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్ధులు తమ తమ హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌తో పాటు ఉండే ఇతర పత్రాల్ని పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురాకూడదు.
అదే విధంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు మెయిన్స్ పరీక్ష మార్చ్ 25న జరగనుంది. ఈ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. మార్చ్ 25 ఉదయం సెషన్‌లో పేపర్ 1, మద్యాహ్నం పేపర్ 2 కంప్యూటర్ ఆధారిత టెస్ట్ నిర్వహిస్తారు. ఇక 2024 ఫిబ్రవరిలో విడుదలైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు మార్చ్ 25న మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు మార్చ్ 18 అంటే రేపు విడుదల కానున్నాయి.
హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
ముందుగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in/Default ఓపెన్ చేయాలి. అభ్యర్ధి యూజర్ నేమ్ స్థానంలో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ స్థానంలో పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ ప్రత్యక్షమౌతుంది.
Also read: Return to Earth: సునీతా విలియమ్స్ విల్మోర్ ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ అవుతారు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









