లోయలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలో ఉన్న ఘాట్‌లో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. శ్రీశైలం నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఆత్మకూరు సమీపంలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది.

Updated: Dec 8, 2019, 01:15 AM IST
లోయలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Representational image

కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలో ఉన్న ఘాట్‌లో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. శ్రీశైలం నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఆత్మకూరు సమీపంలోకి చేరుకున్నాకా... అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోనే చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి ఇతర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.