Araku bus accident news: అరకు : విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి అరకు ఘాట్‌రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన క్షతగాత్రులను అనంతగిరి ఆస్పత్రికి తరలించారు. రాత్రి వేళ జరిగిన ప్రమాదం కావడంతో లోయలో పూర్తిగా చీకటి అలుముకుని ఉంది. దీంతో Resque operations చేపట్టడానికి ఆటంకంగా మారింది. లోయలో పడిన బస్సును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bus accident లో మృతి చెందిన వారంతా హైదరాబాద్‌కి చెందిన వారేనని తెలుస్తోంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో హైదరాబాద్‌లోని షేక్ పేటకు చెందిన ఒక్క కుటంబం నుంచే 26 మంది ఉన్నట్టు సమాచారం. ప్రమాదం తీవ్రత అధికంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది భావిస్తున్నారు. 


Also read : Karnataka accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి, ఐదుగురికి గాయాలు


Araku accident కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకునే వారు ఈ కంట్రోల్ రూమ్ నెంబర్స్‌కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. Accident  control room numbers: 
08912590102
08912590100


Araku bus accident లో గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook