Asia Cup 2023: ఆసియా కప్, ఆప్ఘన్ సిరీస్‌కు పాకిస్తాన్ ప్లేయింగ్ 18 ఇదే
Asia Cup 2023: మొత్తానికి ఆసియా కప్ 2023 ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఆసియా కప్, ఆప్ఘనిస్తాన్ సిరీస్ రెండింటికీ పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Asia Cup 2023: ఆసియా కప్ వేదిక, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో నెలకొన్న పేచీ పరిష్కారమై పాకిస్తాన్ ఆసియా కప్ 2023 కు సంసిద్దమైంది. పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఆసియా కప్ 2023కు ఆడే పాకిస్తాన్ జట్టు ఇదే..
శ్రీలంక వేదికగా ఆగస్టు 22 నుంచి 26 వరకూ ఆప్ఘనిస్తాన్‌తో 3 వన్డేల సిరీస్ జరగనుంది. మరోవైపు ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 17 వరకూ పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆతిధ్యమిస్తున్న ఆసియా కప్ 2023 ఉంటుంది. ఈ క్రమంలో రెండు టోర్నీలకు 18 సభ్యుల జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. బాబర్ ఆజమ్ కెప్టెన్ కాగా షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా ఉంటారు. పాకిస్తాన్ జట్టులో కొత్తగా ఫహీమ్ అష్రాప్, సాద్ షకీల్, తయ్యబ్ తాహిర్‌లు చోటు దక్కించుకున్నారు. గాయం ఇంకా తగ్గకపోవడంతో ఇహసానుల్లా జట్టుకు ఎంపిక కాలేదు.
శ్రీలంక వేదికగా పాకిస్తాన్-ఆప్ఘనిస్తాన్ మద్య మూడు వన్డేల సిరీస్ ఇలా ఉంటుంది. తొలి వన్డే ఆగస్టు 22వ తేదీన, రెండవ వన్డే 24వ తేదీన హంబన్ తోటలో జరుగుతాయి. ఇక మూడవ వన్డే మాత్రం కొలంబోలో ఆగస్టు 26వ తేదీన జరుగుతుంది. ఇక ఆసియా కప్ 2023కు కూడా ఇదే జట్టు ఆడనుంది. పీసీబీ ఎంపిక చేసిన ప్లేయింగ్ 18లోనుంచే ప్లేయింగ్ 11 అనేది ఎప్పటికప్పుడు నిర్ణయమౌతుంది.
ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ ఆగస్టు 30వ తేదగీన ముల్తాన్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఆ తరవాత సెప్టెంబర్ 2వ తేదీన ఇండియాతో ఆడనుంది.
ఆసియా కప్ 2023, ఆప్ఘనిస్తాన్ సిరీస్ కోసం పాకిస్తాన్ ప్లేయింగ్ 18 జట్టు
బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, హారిస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమామ్ ఉల్ హక్, మొహమ్మద్ హారిస్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీం జూనియర్, నసీం షా, ఆఘా సల్మాన్, సాద్ షకీల్, షాహీన్ ఆఫ్రిది, తయ్యబ్ తాహిర్, ఉసామా మీర్
Also read: Irfan Pathan: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ..హార్దిక్ వల్లే మిస్సయిందా, వైరల్ అవుతున్న ఇర్ఫాన్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook