Sikkolu Politics: ఏపీలో హోం మంత్రి మార్పు? పక్కా వ్యూహంతో సిక్కోలు నాయకుడి పావులు

Atchannaidu Targets Home Ministry New Politics In North Andhra: సిక్కోలులో ఆయనో సీనియర్‌ ఎమ్మెల్యే..! ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మూడుసార్లు మంత్రిగానూ పనిచేశారు! కానీ రాజకీయంగా ఆయనలో అసంతృప్తి నెలకొందా..! ప్రస్తుత సర్కార్‌లో కోరుకున్న పోస్టు దక్కలేదనే నిరాశ పెరిగిపోతోందా..! ఈనేపథ్యంలో ఆయన ఇప్పుడు రూట్ మార్చారా..! ఇంతకీ ఆయన చేం చేస్తున్నారు.. ఆయన టార్గెట్‌ ఏంటి..! 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 13, 2025, 04:46 PM IST
Sikkolu Politics: ఏపీలో హోం మంత్రి మార్పు? పక్కా వ్యూహంతో సిక్కోలు నాయకుడి పావులు

AP Home Ministry: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ప్రాంతం వైసీపీకి కంచుకోట. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ కంచుకోటను కూటమి సర్కార్‌ బద్దలు కొట్టింది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీని పూర్తిగా తుచిడిపెట్టేసింది తెలుగుదేశం పార్టీ అయితే సిక్కోలు టీడీపీ గెలుపు వెనుక కీలక పాత్ర పోషించారు టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. దాంతో ఆయనకు చంద్రబాబు ప్రభుత్వంలో హోంశాఖ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆయన్ను పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు, వంగలపూడి వనితను హోం మంత్రిని చేసి అచ్చన్నకు మాత్రం మరో శాఖకు కట్టబెట్టారు. దాంతో ఆ శాఖతోనే ఆయన సంతృప్తి చెందుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన రూట్‌ మార్చినట్టు కనిపిస్తోంది.

Add Zee News as a Preferred Source

Also Read: Chandrababu Naidu: 'మహిళలతో మాది అన్నాచెల్లెళ్ల బంధం.. వారి అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం'

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ ఏడాది పాలనను త్వరలోనే పూర్తి చేసుకోబోతోంది. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు సర్కార్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల్లో మంచి మద్దతు కూడగట్టుకుంది. మరోవైపు మంత్రివర్గంలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో వారిని మార్చేసి కొత్తవారికి చాన్స్ ఇస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు శరవేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. అటు అధికారులు అయితే మంత్రి మాటే వేద వాక్కులా పనిచేస్తున్నారని సమాచారం.

Also Read: YS Jagan: సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. 'ఇది తొలి హెచ్చరిక'

ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టీటీపీకి పెద్దదిక్కులా ఉన్నారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. మూడోసారి మంత్రిగా పనిచేస్తున్నారు. అటు దివంగత నేత  ఎర్రన్నాయుడు అకాల మరణం తరువాత సిక్కోలుపై పూర్తిపట్టు సాధించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఒకవైపు ఢిల్లీలో చక్రం తిప్పుతుండగా.. మంత్రిగా రాష్ట్రంలో బలమైన బీసీ నేతగా ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వాస్తవానికి అచ్చెన్నాయుడుకు హోంమంత్రిగా భాద్యతలు అప్పగిస్తారని అప్పట్లో చర్చ జరిగింది. రామ్మోహన్ నాయుడు బాబాయికి హోమ్ శాఖ భాద్యతలు అప్పగించాలని ఎన్నికలకు ముందే విన్నవించారు. కానీ పొలిటికల్ ఈక్వేషన్‌లో అంచనాలు తారుమారమయ్యాయి. 

ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రలో తన పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అటు ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్‌ జూనియర్లు కావడంతో నేతలంతా అచ్చెన్న వద్దకే  క్యూ కడుతున్నారు. అటు ఉత్తరాంధ్రలో 35 ఎమ్మెల్యేలు ఐదుగురు ఎంపీలు ఉంటే వీరిలో అచ్చెన్న వర్గీయులు, బంధువులు 15 మంది వరకు ఉన్నారట. ఈ లెక్కలన్నీ చూసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు దూరదృష్టితోనే తనదైన శైలిలో రాజకీయాల్లో పావులు కదుపుతున్నారని ప్రచారం సాగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News