Ayyappa devotees protest at kapila theertham in Tirumala Video: కార్తీక మాసం నేపథ్యంలో తిరుమలలో భక్తులు రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. మరోవైపు అయ్యప్పమాల వేసుకున్నస్వాములు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. చాలా మంది తిరుమల, అరుణాచలం, శబరి మలకు వెళ్తుంటారు.ఈ క్రమంలో తిరుమలకు అయ్యప్ప స్వాములు పొటెత్తారు. అయితే.. తిరుమలలో కపిల తీర్థంలో అయ్యప్ప స్వాముల్ని అనుమతించకపోవడంతో పెద్ద దుమారం చెలరేగింది.
అయ్యప్ప భక్తులు ఆందోళనతో దిగివచ్చిన అధికారులు
పుష్కరిణీలో అయ్యప్ప భక్తులు స్నానాలకు అనుమతి
ఆందోళన చేసినప్పుడే కాదు.. ప్రతి రోజూ వదలండి అంటూ భక్తుల డిమాండ్ https://t.co/7jrx9kqV1q pic.twitter.com/gbMupFoZuK
— Telugu Feed (@Telugufeedsite) November 12, 2025
అక్కడున్న సిబ్బంది కపిలతీర్థంలో అయ్యప్పస్వాములను పుణ్యస్నానాలకు అనుమతించలేదు. దీంతో అయ్యప్పలు రోడ్డుమీద కూర్చుని నిరసనలకు దిగారు. చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. మొత్తంగా అక్కడ గందర గోళం ఏర్పడింది. మరోవైపు సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ నేపథ్యంలో తిరుమలలో కపిల తీర్థంలో అయ్యప్పభక్తులకు మరల స్నానాలకు అధికారులు దిగొచ్చి అనుమతుల్ని ఇచ్చారు. మరోవైపు ఆందోళనలు చేపట్టినప్పుడు మాత్రమే కాదని, ప్రతిరోజు తమను అనుమతించాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేశారు. మొత్తంగా ఈ వివాదంతో కపిల తీర్థం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read more: Pawan Kalyan: సమయం ఆసన్నమైంది.. మరోసారి తిరుమల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంచలన ట్విట్.. ఏమన్నారంటే..?
దీంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నిరసనల వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









