)
Balakrishna Shock in hindupur Constituency: సాధారణంగా తమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదనో.. లేకపోతే ఎమ్మెల్యే అయిన తర్వాత తమ వైపు రావడం లేదనో ఆయా నియోజవర్గంలోని ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కానీ బాలయ్య విషయంలో అభిమానులు మరో విధంగా నిరసన చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అవును బాలయ్య సొంత నియోజకవర్గమైన హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్ ను ఆపేసిన హిందూపురానికి చెందిన బాలకృష్ణ వీరాభిమానులు మరియు కార్యకర్తలు. అయితే.. ఈ నిరసన సెగ ఆయన్ని ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరగబోయే క్యాబినేట్ విస్తరణలో ఆయన్ని మంత్రిగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలయ్య అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు డిమాండ్ చేస్తూ బాలయ్య ముందే ప్లక్లార్డులు ప్రదర్శించారు. దీనికి బాలయ్య కాన్వాయ్ నుంచి కిందికి దిగి నాదేం ఉంది.. వాళ్లు ఇవ్వాలి కదా అని బంతిని చంద్రబాబు కోర్టులో నెట్టేసి.. అభిమానులను వారించే ప్రయత్నం చేశారు బాలయ్య. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ లో క్యాబినేట్ లో బాలయ్యను మించిన వ్యక్తి ఎవరున్నారంటూ ధర్నాలు చేశారు. 2014,2019, 2024 ఇలా మూడు సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక భారతీయ నటుడుగా బాలయ్య రికార్డు క్రియేట్ చేసిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు 2019లో తెలుగు దేశం రాష్ట్ర వ్యాప్తంగా గడ్డు పరిస్థితుల్లో రాయలసీమలో తీవ్రంగా నష్టపోయింది. అంత గడ్డు పరిస్థితుల్లో బాలయ్య హిందూపురం నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరిగా నిలిచారు. 2014లోనే ఆయన్ని మంత్రివర్గంలో తీసుకుంటారనే ప్రచారం జరిగింది. ఇక 2024లో కూడా ఆయన్ని మంత్రిగా అభిమానులు చూడాలనుకున్నారు. కానీ కుదరలేదు. బాలయ్యలా ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఈ నేపథ్యంలో రాబోయే క్యాబినేట్ విస్తరణలో బాలయ్యను మంత్రిగా చేయాలని డిమాండ్ చేస్తూ హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేపట్టబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు బాలయ్యను మంత్రిగా క్యాబినేట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేపట్టబోతున్నట్టు తెలిపారు.
హిందూపురం లో బాలకృష్ణ కన్వాయ్ నీ ఆపేసిన హిందూపురం నియోజకవర్గం అభిమానులు, కార్యకర్తలు.మంత్రి వర్గం లోకి బాలయ్య ను తీసుకోవాలి అంటూ నిరసన.. #Balakrishna #hindupuram @JaiTDP pic.twitter.com/xgC9C6NH7n
— Vidya Sagar Reddy (@itz_sagarreddy) October 13, 2025
బాలయ్యకు 2025 బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ యేడాది పద్మభూషణ్ అవార్డుతో పాటు ఆయన వరుసగా 50 యేళ్లుగా హీరోగా నటించడంతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా సేవలు అందిస్తున్నబాలయ్య పేరు ఈ యేడాది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కింది. అంతేకాదు ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి తొలిసారి జాతీయ అవార్డు రావడంతో పాటు నేషనల్ స్టాక్ ఎక్సెంజ్ లో గంట వాయించిన తొలి దక్షిణాది హీరోగా.. ఇలా పలు రికార్డులు అందుకున్నారు. ఈ యేడాది చివర్లో డిసెంబర్ 5న బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ‘అఖండ 2 తాండవం’ డిసెంబర్ 5న విడుదల కానుంది. మరి త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరో రికార్డును క్రియేట్ చేస్తారా అనేది వెయిట్ అండ్ సీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.