)
Mla kamineni srinivas reacts on chiru and balayya row: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఏపీ బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ ఏపీ రాజకీయాలతో పాటు, ఇండస్ట్రీలో సైతం ప్రకంపనలు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో కూటమి వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం నడిచింది. మరోవైపు బాలయ్యను.. వైసీపీ మాజీ మంత్రులు, అభిమానులు ఏకీపారేశారు.
మొత్తంగా కామినేని చేసిన కామెంట్లు పెద్ద రచ్చకు దారితీశాయి. తాజాగా..ఈ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మరోసారి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ అసెంబ్లీలో తాను .. సినీ హీరోలు గత సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంఘటనపై, తాను చేసిన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు
సినీ హీరోలు గత సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంఘటనపై, తాను చేసిన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయనే అభిప్రాయం కలిగిందని వెనక్కి తీసుకున్న కామినేని
అసెంబ్లీ రికార్డు నుంచి తన… https://t.co/oKQD7t9eNg pic.twitter.com/imTlU0UQ6w
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2025
అంతే కాకుండా.. దయచేసి వీటిని అసెంబ్లీ రికార్డు నుంచి తన మాటలను తొలగించాలని స్పీకర్ ను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కోరారు. ఈ క్రమంలో దీనిపై సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ విషయాన్ని స్పీకర్ కు చెప్పి.. రికార్డుల నుంచి తొలగిస్తామని సానుకూలంగా స్పందించారు. మరోవైపు బాలయ్య, చిరు మధ్య వివాదం మాత్రం హాట్ టాపిక్ గామారింది. చిరు అభిమానులు మాత్రం బాలయ్య సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు గత రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్దానికి దారితీశాయి. ఇక ఇప్పటికైన దీనిపై చిరు, బాలయ్య అభిమానులు వెనక్కితగ్గుతారో వెచి చూడాలి.
అసెంబ్లీలో కామినేని మాట్లాడుతూ.. గత కూటమి హయాంలో.. సినిమా సెలబ్రిటీలు వైఎస్ జగన్ ఇంటికి వెళ్లిన సమయంలో అవమానించిన విషయాన్ని మరోసారి అసెంబ్లీలో లేవనెత్తారు. చిరు ఫోర్స్ చేయడంవల్ల.. జగన్ దిగొచ్చారని మాట్లాడారు. కానీ బాలయ్య వెంటనే కల్గజేసుకుని అవమానించడం వరకు నిజమని.. కానీ చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్ల జగన్ దిగొచ్చారనేది అనేది అసత్యమని సభలో బాలయ్య ఫైర్ అయ్యారు. ఈ కామెంట్లపై చిరంజీవి కౌంటర్ కూడా ఇచ్చారు.
గతంలో సీఎంగా ఉన్న జగన్ తనను మర్యాద పూర్వకంగా పిలిస్తే సినిమా ప్రముఖులతో కలిసి వెళ్లానని, ఎక్కడ అవమానం జరగలేదని, బాలయ్య మాటల్ని ఖండించారు. ఈ క్రమంలో బాలయ్య వర్సెస్ చిరంజీవిల మధ్య వార్ మొదలైంది. మరోవైపు బాలయ్య.. జగన్ ను సైకో అనడంపై కూడా వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైఎస్ కుటుంబం బాలయ్యకు చేసిన మేలు మర్చిపోయి నీచంగా ప్రవర్తిస్తున్నాడని, లేకుంటే జైల్లో ఉండాల్సి ఉండేదని ఏకీపారేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.