)
Balakrishna Vs Chiru Vs YSRCP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అసెంబ్లీ లో తెలుగు దేశం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఆందోళన ఉధృతం చేసింది. ఈ క్రమంలో అనంతపురంలో వైసీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురంలో ఆ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణకు మంచి బుద్ధి ప్రసాదించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తక్షణం బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలన్నారు. బాలకృష్ణ తన తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కాగా కామినేని శ్రీనివాస్ ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు కారణం అయ్యాయి.. అయితే, అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం.. పార్టీ సీనియర్ నేతలు.. కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు.. ఎమ్మెల్యేలు కొందరు కావాలనే టార్గెట్ గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట.. బోండా ఉమా వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చంద్రబాబు. అసెంబ్లీలో చిరంజీవి.. జగన్ కు చేతులు జోడించి లొంగిపోయారనే వ్యాఖ్యలపై చిరు కూడా స్పందించారు. అప్పట్లో బాలయ్యను తీసుకువెళదామనుకున్నా.. ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఇక చిరుపై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చిరుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పిలుపునిచ్చారు. అయితే.. బాలయ్య గత చరిత్ర చూస్తే.. ఆయన ఏదో ఒకటి మాట్లాడం అది కాంట్రవర్సీ కావడం ఎప్పటి నుంచో వుంది. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినా.. ఆయన క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేవు. ఇక చిరుకు క్షమాపణలు చెప్పడం ఇంపాజిబుల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొన్ని రోజులు అయితే.. ప్రజలే ఆ విషయాన్ని మరిచిపోతారు.
మరోవైపు నందమూరి బాలకృష్ణ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఇవాళ అమ్మవారు లలితా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ మర్యాదలతో అధికారులు బాలకృష్ణకు స్వాగతం పలికారు. లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. విజయవాడలో దసరా ఏర్పాట్లు బాగున్నాయన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.