YS Jagan Kadapa Tour: ఈదురుగాలులు, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను ప్రభుత్వం ఆదుకోవాలని.. బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లా కడపలోని లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో వైఎస్ జగన్ పర్యటించారు. పంటలు నష్టపోయిన అరటి తోటలు పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు.
Also Read: TDP Why Not Kadapa: వైనాట్ కడప.. జగన్ అడ్డాలో తెలుగుదేశం 'భారీ వ్యూహం'
లింగాల మండలంలో ఈదురుగాలులు, అకాల వర్షాలతో దాదాపు 4 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు జగన్‌కు తెలిపారు. రైతులను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే పంటలకు సంబంధించి 2023–24 ప్రీమియమ్ కట్టకపోవడంతో ఖరీఫ్ రైతులు నష్టపోయారని విమర్శించారు. 2024–25కు సంబంధించిన ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఉచిత పంటల బీమా ఉందా? లేదా? అని ప్రశ్నించారు.
Also Read: Cricket Stadium: 'మోదీ'కి చంద్రబాబు ఝలక్.. ఏపీ రాజధానిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం
'చంద్రబాబు పుణ్యాన ఇప్పటికే అనేక పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం రంగు మారింది. అన్ని రకాల పంటలు నష్టపోయాయి. మొక్కజొన్న, జొన్న పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వరుసగా రెండేళ్ల ఖరీఫ్ సీజన్‌లో అదే జరిగింది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. పంటలకు ఇన్సూరెన్స్ కట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా ఇవ్వడం లేదని తెలిపారు.
'సున్నా వడ్డీ పంట రుణాలకు మంగళం పాడారు. రైతులకు సున్నా వడ్డీ మొత్తం చెల్లించలేదు. కపట ప్రేమ రైతులపై ఉంది. గతంలో చీనీ పంటకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టన్నుకు రూ.లక్ష వరకు ఉంటే ఇప్పుడు రూ.23 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు మాత్రమే వస్తోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. 'బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. బీమా సొమ్ము కూడా చెల్లించాలి' అని కోరారు.
వచ్చేది మన ప్రభుత్వమే!
'వచ్చేది మన ప్రభుత్వమే. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. మూడేళ్లు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం ఏర్పడగానే నెల రోజుల్లోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తాం. రైతులకు రాని బీమా కూడా కల్పిస్తాం. ప్రతి రైతు ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. ప్రతి రైతుకు 2023లో ఇచ్చినట్లుగా రూ.50వేలు ఇస్తాం. ఇది ప్రతి రైతుకు భరోసా ఇస్తూ చెబుతున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
మూడేళ్లు ఓపిక పట్టండి..ప్రతి రైతు మొహం సంతోషంగా ఉండేలా చేస్తా! pic.twitter.com/Um0Lr7Lypb
— We YSRCP (@we_ysrcp) March 24, 2025
అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ గారు పరామర్శ
తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించిన వైయస్ జగన్ గారు, ఎంపీ అవినాష్ రెడ్డి, నాయకులు#YSJaganForFarmers#CBNFailedCM#YSJaganInPulivendula#TDPGoons… pic.twitter.com/3g9IEBfvhf
— YSR Congress Party (@YSRCParty) March 24, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









