Ration Cards: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్! రేషన్‌ కార్డులు ఈ కేవైసీ చేసుకున్నారా?

Follow These Steps For AP Ration Cards E KYC: పేదలకు తక్కువ ధరకు వస్తువులు లభించే కేంద్రం చౌకధర దుకాణాలు. ఏపీలో కొత్తగా స్మార్ట్‌కార్డులు అందిస్తుండగా.. ప్రభుత్వం ఈ కేవైసీ చేయించుకోవాలని చెబుతోంది. రేషన్‌ కార్డుల ఈ కేవైసీ విధానం ఇలా ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 10, 2025, 06:40 PM IST
Ration Cards: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్! రేషన్‌ కార్డులు ఈ కేవైసీ చేసుకున్నారా?

Ration Cards E KYC: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల పేరిట ఇస్తోంది. స్మార్ట్‌ కార్డుల ద్వారా పాదర్శకంగా లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు అందిస్తోంది. ఈ లక్ష్యంలో భాగంగా రేషన్‌ పంపిణీలో మరికొన్ని మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అప్‌డేట్‌ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీనికోసం ఈ కేవైసీ చేసుకోవాలని చెబుతోంది. ఈ కేవైసీ తప్పనిసరి చేయడంతో లబ్ధిదారులు రేషన్‌ కార్డులు కేవైసీ చేసుకునే విధానం ఇలా ఉంది.

Add Zee News as a Preferred Source

Also Read: Schools Close: ఈ వారంలో 4 రోజులు స్కూళ్లకు సెలవు.. ఎక్కడ? ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. నకిలీ రేషన్‌ కార్డులను తొలగించే క్రమంలో అసలైన లబ్ధిదారులను గుర్తించడంలో భాగంగా ఈ కేవైసీ చేయాలని సూచిస్తోంది. ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ కేవైసీ చేయించుకోలేదు. ఈ కేవైసీ చేయని వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది.

ఈ కేవైసీ అంటే?
కేవైసీ అంటే నో యువర్‌ ఛేంజెస్‌ (మీ మార్పులు) ని అర్థం. వేలిముద్ర ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారుడిని ధృవీకరించే ప్రక్రియ. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.

Also Read: Schools Hoiday: విద్యార్థులకు అలర్ట్‌.. రేపు సోమవారం 10వ తేదీన పాఠశాలలకు సెలవు!

ఈ కేవైసీతో ప్రయోజనాలు
నకిలీ కార్డుల తొలగింపు
సరుకుల పారదర్శక పంపిణీ
అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి
ప్రభుత్వ డేటా అప్‌డేట్

ఈ కేవైసీ ఎక్కడ చేయాలి?
రేషన్ డీలర్ షాప్‌లో ఈ కేవైసీ చేసుకోవచ్చు. వేలిముద్రతో వెంటనే ఈ కేవైసీ అవుతుంది.
గ్రామ / వార్డు సచివాలయం కుటుంబసభ్యుల ధృవీకరణ చేస్తారు.
ఈ పోస్‌ (E PoS) యంత్రంలో వేలిముద్ర వేయగానే ఈ కేవైసీ పూర్తవుతుంది.

Also Read: Udyogini Scheme: మహిళలకు ఈ పథకం ఓ వరం.. వడ్డీ లేకుండా రూ.3 లక్షలు ఇలా!

కార్డు పొందనివారు ఏం చేయాలి
రేషన్ డీలర్లు కార్డులను తహసీల్దార్ కార్యాలయాలకు పంపిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారు స్వయంగా వెళ్లి అక్కడ రేషన్‌ కార్డులు పొందవచ్చు

ఈ కేవైసీకి ఉపయోగకరమైన వెబ్‌సైట్లు
రేషన్ స్టేటస్: https://epdsap.ap.gov.in
ఫిర్యాదులు: https://spandana.ap.gov.in
ఇతర సేవలు: https://ap.meeseva.gov.in

ఈ కేవైసీ చేసుకోకపోతే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. ఈ కేవైసీపై నిర్లక్ష్యం చేయరాదు. ఈ కేవైసీ ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లోనే సాధ్యం. వేలిముద్రతో ఈ కేవైసీ పూర్తవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News