Ap Ration Cards Ekyc Process: ఏపీ ప్రభుత్వం రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రేషన్ షాపుల పరిధిలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. అయితే ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. రేషన్ కార్డులు ఉన్నవారు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని.. లేకుంటే డిసెంబర్ నెల నుంచి కార్డులను రద్దు చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు బియ్యం, పప్పులు, నూనె వంటి వస్తువులను అందిస్తోంది. వీటితో పాటు ఈ కార్డు ఆధారంగానే సర్కార్ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తోంది. వీటన్నింటికీ కీలకమైన రేషన్ కార్డులు రద్దు కాకుండా ఉండాలంటే.. ప్రతి ఒక్క రేషన్ కార్డు సభ్యులు ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.
రేషన్ కార్డులో సభ్యుల్లో చాలా మందికి ఈకేవైసీ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు ఈకేవైసీ గురించి ప్రజలను అప్రమత్తం చేసింది. అయినా, ఇంకా లక్షల మంది ఈకేవైసీ చేయించుకోలేదు. ఇప్పుడు వారందరికీ మరో అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. నవంబర్ చివరి నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. నిజానికి అక్టోబర్ చివరి కల్లా ప్రక్రియ పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్ గడువు పెట్టింది. అయితే గడువు ముగిసి వారం రోజులు అవుతున్నా.. ఇంత వరకు లక్షల రేషన్ కార్డులకు ఈకేవైసీ కాలేదు. అందుకే చివరి ఛాన్స్‌గా ఇప్పుడు మరోసారి గడువును పెంచారు.
రేషన్ కార్డులో ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్నవారు.. మీ పరిధిలోని రేషన్ డీలరు దగ్గరకు వెళ్లి జస్ట్ ఈ-పోస్‌లో కార్డుదారులు ఒకసారి వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఆ వెంటనే రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ డీలర్ మాత్రమే కాదు.. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. డిసెంబర్ నెల నుంచి రేషన్ సదుపాయాలు కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:Rashmika Mandanna: త్వరలోనే నాకు, విజయ్ దేవరకొండకి పెళ్లి.. అఫీషియల్‌గా కన్ఫామ్ చేసిన రష్మిక మందన్నా
Also Read: Kamal Haasan: 50 ఏళ్ల సినీ జీవితంలో స్టార్ హీరో కమల్ హాసన్ సంపాదించిన ఆస్తులు ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









