Tirumala Heavy Crowd: తిరుమల భక్తులకు కీలక విజ్ఞప్తి. వరుస సెలవులు.. విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల గిరులు భక్తులతో పోటెత్తుతున్నాయి. దీంతో తిరుమల కిటకిటలాడుతోంది. ఈ సమయంలో తిరుమలకు వెళ్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా దర్శనం, వసతి గదులు బుక్ చేసుకున్న వారు వెళ్తే తప్ప మిగతా వారు వస్తే గంటల కొద్దీ నిరీక్షించాల్సి ఉంటుంది. తిరుమల పర్యటనను కొన్ని రోజులు వాయిదా వేసుకుంటే బెటర్.
Also Read: Lord Shiva: ఆలయంలో కళ్లు తెరిచిన శివుడి విగ్రహం.. అసలు రహాస్యమేమిటో తెలుసా?
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. వరుసగా మూడు రోజులు సెలవులు, ఇంటర్ ఫలితాలు వెలువడడం.. ముందస్తుగానే వేసవి సెలవులు ఇస్తుండడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలతో పాటు, సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సోమవారం ఉదయం 7 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.
Also Read: K Kavitha: 'తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు' గులాబీ శ్రేణులకు కవిత పిలుపు
వరుస సెలవులతోపాటు వారాంతం కావడంతో ఆదివారం తిరుమలకు భక్తులు వేల సంఖ్యలో తరలివచారు. ఆదివారం రోజు శ్రీవారిని 82,746 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారికి భక్తుల నుంచి హుండీల ద్వారా రూ.3.85 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజురోజుకు భక్తుల రద్ధీ పెరిగిపోతుండడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు.. ఎండలు తీవ్రరూపం దాలుస్తుండడంతో కొండపై ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం అందిస్తున్నారు.
ప్రముఖుల దర్శనం
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సోమవారం ఉదయం నైవేద్య విరామంలో దర్శించుకున్నారు. మొదటగా వైకుంఠం ద్వార ప్రవేశించి మహాద్వారం నుంచి స్వామిని దర్శించుకుని వచ్చారు. సంగీత దర్శకుడు థమన్ ఉదయం నైవేద్య విరామంలో వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









