Free Parking: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. మాల్స్‌, మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ ఫ్రీ.. ఫ్రీ

Free Parking In Malls And Multiplex Theatres In Andhra Pradesh: వినోదం.. షాపింగ్‌ కోసం మాల్స్‌, మల్టీప్లెక్స్‌లకు వెళ్తున్న ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై మాల్స్‌, మల్టీప్లెక్స్‌కు వెళ్తే పార్కింగ్‌ ఫీజు చెల్లించనసరం లేదు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 25, 2025, 08:47 PM IST
Free Parking: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. మాల్స్‌, మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ ఫ్రీ.. ఫ్రీ

Free Parking In Malls And Multiplex: ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వినోదం.. షాపింగ్‌ కోసం వెళ్తున్న వాహనదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌ థియేటర్‌లలో ఇకపై వాహనాలు పార్కింగ్‌ చేసినందుకు డబ్బు చెల్లించనవసరం లేదు. ఉచితంగా పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు విధిగా ఉచిత పార్కింగ్‌ కల్పించాలని మాల్స్‌, మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఉచిత పార్కింగ్‌కు కొన్ని షరతులు విధించింది. అవేమిటో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Welfare Schemes: ప్రజలకు భిక్షం మాదిరి కాకుండా సేవలా సంక్షేమ పథకాలు అందించాలి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లలో పార్కింగ్ చార్జీలు వసూలుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వినోదం.. షాపింగ్‌ కోసం వచ్చిన మాల్స్‌.. మల్టీప్లెక్స్‌ థియేటర్‌లో వినియోగదారులకు ఉచిత పార్కింగ్‌ కల్పించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌ కుమార్ ఆదేశించారు. అయితే మొదటి అరగంట సేపు మాత్రమే ఉచితంగా పార్కింగ్ సదుపాయం కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read: Tax Payers: పన్ను చెల్లింపుదారులకు బంపర్‌ ఆఫర్‌.. 50 శాతం భారీ డిస్కౌంట్‌!

ప్రజలకు ఊరట
మాల్స్‌లో షాపింగ్ చేసినట్లయితే ఆ బిల్లు చూపిస్తే మొదటి గంటపాటు పార్కింగ్ ఉచితంగా కల్పించాలని ఏపీ మున్సిపల్‌ శాఖ ఆదేశించింది. పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ధర ఉన్న సినిమా టికెట్ లేదా షాపింగ్ చేసిన బిల్లు చూపిస్తే పార్కింగ్ పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని మాల్స్‌, మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం సూచించింది. ఆయా మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మల్టిప్లెక్స్ యజమానులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. పార్కింగ్‌ ఫీజుతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఊరట లభించింది. పార్కింగ్‌ ఛార్జీల పేరిట మాల్స్‌ యజమాన్యాలు వేధిస్తుండడంతో ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News