Govt Employees Tranfers Guidelines: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించే పనిలో ప్రభుత్వం పడింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బదిలీల్లో కీలక అడుగు పడింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపగా తాజాగా మార్గదర్శకాలు విడుదల చేయడంతో త్వరలోనే ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. ఇన్నాళ్లు భార్యాభర్తలు, కుటుంబం ఇలా వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఊరట లభించనుంది.
Also Read: Power Interrupts: 'తెలంగాణలో కరెంట్ కట్ ఉండరాదు'.. అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం
ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మే 16 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా శాఖల్లో బదిలీలకు అర్హతలపై మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. నెల రోజుల్లోపే ఉద్యోగుల సాధారణ బదిలీలు అమల్లోకి రానున్నాయి.
Also Read: Letter To Sonia Gandhi: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. నేరుగా సోనియా గాంధీకి లేఖ రాసిన మహిళలు
మార్గదర్శకాలు ఇలా..
==> ఒకే చోట ఐదేళ్లు గడిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
==> పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారికీ బదిలీలు ఉండనున్నాయి.
==> ఐదేళ్ల లోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలు ఉంటాయి.
==> వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు లభించింది.
==> అంధులైన ఉద్యోగులకు బదిలీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
==> ఇక మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు.
==> గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
==> మెడికల్ గ్రౌండ్‌లో భాగంగా బదిలీల్లో వినతి మేరకు బదిలీలు ఉండనున్నాయి.
==> వితంతు ఉద్యోగులకు బదిలీల్లో వారు విజ్ఞప్తి చేసుకుంటేనే వారి బదిలీకి అవకాశం ఇవ్వనున్నారు.
==> స్పౌజ్ ఉద్యోగులను ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యం కల్పించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter









