
Teachers Manual Counselling: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు భారీ శుభవార్త ప్రకటించింది. బదిలీల కౌన్సిలింగ్ విషయమై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ వర్గాలు మూడు రోజులుగా తీవ్ర ఆందోళనలు చేస్తుండడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. సోమవారం మధ్యాహ్నం ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్.. సాయంత్రం లోపే యూటర్న్ తీసుకున్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్‌కు అంగీకారం తెలిపారు. మాన్యువల్ విధానంలో బదిలీలకు కౌన్సిలింగ్ ని్వహిస్తామని ప్రకటించారు.
మూడు రోజులుగా ఆందోళన
రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా నేరుగా బదిలీలు చేయాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే డిమాండ్‌తో వారు బదిలీలకు దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఈ నేపథ్యంలో వరుస ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆందోళనలో భాగంగా సోమవారం అన్ని జిల్లాల్లో విద్యాశాఖ అధికారి కార్యాలయాలను ముట్టడించారు. డీఈఓ కార్యాలయ వద్ద టీచర్లు నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం తక్షణం ఉపాధ్యాయ డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్జీటీ ఉపాద్యాయ పోస్టులు బదిలీల్లో మాన్యువల్‌గా బదిలీలు చేపడతామని ప్రభుత్వం ఇచ్చిన హామీనీ అమలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు ఐక్య వేదిక నిరసన దీక్షలు చేపట్టాయి. ఈ మేరకు మూడు రోజులుగా ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. మాన్యువల్ కౌన్సిలింగ్ ప్రకటించే వరకు వెబ్ కౌన్సిలింగ్లో ఉపాధ్యాయులు పాల్గొనకుండా బహిష్కరించారు.
మాన్యువల్ కౌన్సెలింగ్
ఎస్జీటీ బదిలీల అంశంలో ఆన్లైన్ కౌన్సెలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. టీడీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తితో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్లో కౌన్సెలింగ్‌తో ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంటే.. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook