APPSC Age Limit Extends: ప్రభుత్వ ఉద్యోగం అనేది యువతకు ఒక కల. ఆ కల తీర్చుకోవడానికి సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాని పరిస్థితుల్లో వయో పరిమితి తీరిపోవడంతో కొందరు ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోతుంటారు. అలాంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ తీపి కబురు వినిపించింది. వయో పరిమితిని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటనతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: IND VS AUS Champions Trophy 2025 LIVE Score: ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ.. మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్
ఉద్యోగాల భర్తీ అంశంలో మంగళవారం ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఉద్యోగ అర్హతల్లో కీలకమైన వయోపరిమితిని పెంచుతూ ఎన్డీఏ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. యూనిఫాం సర్వీసెస్‌కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్‌కు 34 నుంచి 42 ఏళ్లకు వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వయో పరిమితి పెంపు అంశంలో కీలక మెలిక పెట్టింది.
Also Read: IND Vs Aus: భారత్ ను కంగారు పెడుతున్న ఆస్ట్రేలియా.. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా..
సెప్టెంబర్ 30వ తేదీలోపు జరిగే పరీక్షలకు మాత్రమే తాజాగా పెంచిన వయో పరిమితి అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు పెంచిన వయో పరిమితి అమలు చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ నిర్ణయంపై నిరుద్యోగులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏపీపీఎస్సీ వయో పరిమితి పెంపు నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నవారు కూడా ఉన్నారు. ఈ నిర్ణయంతో వయో పరిమితి దాటిన వారికి మరో అద్భుత అవకాశం లభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









