Fishermen DBT Scheme: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. రేపు బ్యాంకు ఖాతాల్లో రూ.20 వేలు ఖాతాలలో జమ కానున్నాయి. ఏపీ ప్రభుత్వం డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది. రేపు రాష్ట్రంలోని మత్య్సకారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. ‘మత్స్యకారుల సేవలో’ పేరుతో ఆర్థిక సహాయం అందించే పథకం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.
Also Read: Modi Babu Meet: పాకిస్థాన్‌పై ఏ నిర్ణయమైనా తీసుకోండి: ప్రధాని మోదీకి చెప్పిన చంద్రబాబు
సముద్రంలో వేట విరామ సమయంలో ఆర్ధిక సాయం అందిస్తామని ఎన్నికల హామీ ఇవ్వగా దానిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 అందించనున్నారు. 1,29,178 కుటుంబాలకు రూ.258 కోట్ల లబ్ది జరగనుంది. మత్స్యకారులను ఆర్ధికంగా ఆదుకునేలా ‘మత్స్యకారుల సేవలో’ పేరుతో సహాయం అందించనుంది. సముద్రంలో వేట విరామంతో ఉపాధి కోల్పోయే మత్య్సకారులకు ఈ సహాయం అందించనున్నారు.
Also Read: Tamanna Bhatia: హీరోయిన్ తమన్నాకు భారీ షాక్.. వివాదంలో 'ఓదెల -2 సినిమా
ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధంలో ఉండనుంది. వేట విరామం సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంతో 12 తీర ప్రాంత జిల్లాల్లో సముద్రం వేటపై జీవిస్తున్న 1,29,178 కుటుంబాలకు ఆర్ధికంగా రూ.258 కోట్ల ప్రయోజనం కలగనుంది. మత్స్యకారులు, ఆక్వా రంగానికి ఊరట లభించనుంది.
వేట విరామ సమయంలో నాటి సీఎం వైఎస్ జగన్ ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10,000 చెల్లించింది. 2 నెలల పాటు సముద్రంలో వేటకు వెళ్లకుండా విరామంతో మత్స్యకార కుటుంబాలకు ఆర్ధికంగా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుండడంతో చంద్రబాబు రూ.20 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రూ.10 వేల నుంచి రూ.20,000కు పెంచుతామని ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వగా తాజాగా ఆ హామీని నిలబెట్టుకుంటోంది.
కూటమి ప్రభుత్వం ఆక్వారంగం అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆక్వారంగాన్ని గ్రోత్ ఇంజిన్‌గా ప్రభుత్వం ఎంచుకుంది. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు ఇప్పటికే ఇస్తుండగా.. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు నష్ట పరిహారం అందిస్తోంది. గతేడాది చనిపోయిన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు సాయం అందించగా.. మరో 80 కుటుంబాలకు త్వరలోనే సాయం అందించనుంది. వీటికోసం రూ.8 కోట్లు కేటాయించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









