Tax Payers 50 % Discount: పన్ను చెల్లిస్తున్నారా..? భారీగా పన్ను బకాయి పడిందని బాధపడుతున్నారా? మీకోసమే ఈ వార్త. అద్భుతమైన శుభవార్త. పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. బకాయిపడిన పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం భారీ రాయితీ అందించింది. ప్రజలపై భారీ పడకుండా పన్ను రాయితీ అవకాశం కల్పించింది. పన్ను చెల్లింపుదారులు అద్భుత అవకాశం వినియోగించుకోండి. వార్త విశేషాలు ఇవే.
ఆస్తి పన్ను అనేది ప్రతి ఏడాది విధిగా చెల్లించాల్సిన పన్ను. ఆస్తి పన్ను బకాయి పడిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ ఏపీ మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ వరకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
Also Read: Chandrababu: వేసవిపై సీఎం చంద్రబాబు అలర్ట్! అధికారులకు కీలక ఆదేశాలు
ఆస్తి పన్నుల విషయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతోపాటు భారీగా ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఆస్తి పన్ను బకాయిలు రాష్ట్రవ్యాప్తంగా భారీగా బకాయి పడ్డాయి. రూ.వేల కోట్లలో ఆస్తి పన్ను బకాయిలు ఉండడంతో అధికార యంత్రాంగం వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. పన్ను బకాయిలు చెల్లించడానికి పన్ను చెల్లింపుదారులు ఆసక్తి కనబర్చకపోవడంతో ఈ రాయితీ ఆఫర్ ప్రకటించారు.
లక్ష్యం నెరవేరుతుందా?
ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం సాధించేందుకు అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఆస్తి పన్ను బకాయిలు వసూళ్లు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో ఆస్తి పన్ను చెల్లింపులు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం సాధించేందుకు అధికారులు భారీ కార్యాచరణతో వెళ్తున్నారు. మరి ప్రభుత్వం ప్రకటించిన రాయితీతో ఆస్తి పన్ను చెల్లింపుదారులు బకాయిలు చెల్లిస్తారా? లేదా? ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది ఏప్రిల్ 1వ తేదీన వెల్లడి కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









