)
Single Eye In Srikalahasti: ఆంధ్రప్రదేశలో ఆధ్యాత్మిక విషయాల్లో తరచూ వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తిరుమల లడ్డూ, తిరుపతిలో తొక్కిసలాట సహా తదితర సంఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా మహా శివరాత్రి ఉత్సవాల్లో కూడా ఓ వివాదం జరిగింది. మహా శివరాత్రి ఉత్సవాల్లో మహా అపచారం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తీ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహానికి ఒక కన్ను లేకుండాపోయింది. కన్ను లేకుండా ఉత్సవాలు నిర్వహించడం తీవ్ర దుమారం రేపుతోంది.
శ్రీకాళహస్తి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. మహాశివరాత్రి పర్వదినం రోజున వేలాదిమంది భక్తులు వాయులింగేశ్వరస్వామి దర్శనానికి రాగా.. ఓ సంఘటన వివాదాస్పదంగా మారింది. దక్షిణ గోపురం ముందు ఉన్న ధ్వజస్తంభంలో అమ్మవారు కొలువై ఉన్న విగ్రహంలో ఒక కన్ను లేకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. ఆలయంలో విద్యుత్ దీపాలు అలంకరణ, పుష్పాలతో అలంకరణ వైభవంగా చేశారు. కానీ ధ్వజస్తంభం మీద ఉన్న అమ్మవారు కళ్లలో ఒక కన్ను లేదు. ఒక కన్ను అక్కడ ఉంచలేదు. దీంతో వివాదంగా మారింది. అర్చకులు, ఆలయ అధికారులు స్పందించి అమ్మవారి కన్నును పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.
దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయు లింగేశ్వరుడు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పురస్కరించుకుని గురువారం జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండగ జరిగింది. పురవీధులలో ఆదిదంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. హర హర మహాదేవ అంటూ భక్తులు నామస్మరణ చేశారు. రథోత్సవ ఉత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీప ధూప నైవేద్యాల సమర్పించిన అనంతరం వేద పండితులు శాస్త్రోక్తంగా రథాన్ని ప్రారంభించారు. రథోత్సవ సందర్భంగా పురవీధులలో భక్తుల కోసం అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లు, తాగునీళ్లు అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.