Posani Krishna Murali అన్ని కేసుల్లో పోసాని కృష్ణ మురళీకి బెయిల్.. రేపు జైలు నుంచి విడుదల?

Big Relief To Posani Krishna Murali Gets Bail In All Cases: సినీ నటుడు పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట లభించింది. అన్ని కేసుల్లో అతడికి కోర్టు బెయిల్‌ మంజూరవడంతో రేపు విడుదలయ్యే అవకాశం ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 11, 2025, 07:30 PM IST
Posani Krishna Murali అన్ని కేసుల్లో పోసాని కృష్ణ మురళీకి బెయిల్.. రేపు జైలు నుంచి విడుదల?

Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ అరెస్ట్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిగా ఉన్న పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట లభించింది. అతడిపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్‌ లభించింది. వరుసగా కోర్టులు పోసాని కృష్ణ మురళీకి బెయిల్‌ లభించడంతో అతడి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కేసుల్లో బెయిల్‌ లభించడంతో రేపు పోసాని జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source

Also Read: Chandrababu: ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తే తాట తీస్తా: సీఎం చంద్రబాబు హెచ్చరిక

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పోసాని కృష్ణమురళికి అన్ని కేసుల్లో సంబంధిత న్యాయస్థానాలు బెయిల్స్‌ ఇచ్చాయి. ఆదోని, విజయవాడ కోర్టుల్లో ఒకే రోజు పోసానికి బెయిల్‌ రావడం గమనార్హం. ఇప్పటికే నర్సారావుపేట, రాజంపేట, కడప కోర్టులు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

Also Read: YS Sharmila: మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు యూటర్న్‌.. వైఎస్ షర్మిల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పోసానీ కృష్ణ మురళీపై మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. మహాశివరాత్రి రోజు ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొన్నేళ్ల కిందట ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాలకు ఇప్పుడు కేసులు నమోదు చేయడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోసానికి న్యాయపరంగా ఊరట లభించకుండా ప్రభుత్వం కుట్ర చేసిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో కూడా ఆ వివరాలు బయటకు రాలేదు. దీనిద్వారా బెయిల్‌ పిటిషన్‌ వేయకుండా కుట్ర చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కో కేసులో పీటీ వారెంట్‌ కోరుతూ వందలకొద్దీ కిలోమీటర్లు పోసాని కృష్ణ మురళీని పోలీసులు తిప్పారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా రాజంపేటకు, అక్కడి నుంచి నర్సరావుపేట, గుంటూరు, ఆదోని, మళ్లీ విజయవాడలోని సూర్యారావుపేటకు, అక్కడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు తిప్పారు.

కుటుంబసభ్యులు, వైసీపీ విమర్శలు
పోసానీ కృష్ణ మురళీ పట్ల వ్యవహారించిన తీరుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అతడి కుటుంబసభ్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 67 ఏళ్ల వయసులో హృద్రోగ సమస్యలు ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా అతడిని వేధించారని ఆరోపిస్తున్నారు. ఈ ధోరణిపై న్యాయస్థానాల్లో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ వాదనలు వినిపిస్తూ పోసానికి ఉపశమనం లభించేలా చేసిన ప్రయత్నం సఫలమైంది. పోసానిపై నమోదైన కేసుల్లో 35ఏ నోటీసు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. విశాఖపట్నం వన్‌ టౌన్‌లో నమోదైన కేసులో పూర్తిగా విచారణను నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్‌ నుంచి పోసానికి, అతడి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ పూర్తి అండగా నిలుస్తోంది. అన్ని కేసుల్లో బెయిల్‌ లభించడంతో పోసాని కృష్ణ మురళీ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News