APPSC Group 2 Mains: చంద్రబాబుకు భారీ షాక్.. రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు

No Postpone Of APPSC Group 2 Mains Exams: గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలపై గందరగోళం వీడింది. వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా కూడా ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. రేపటి నుంచి యథావిధిగా పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 22, 2025, 09:24 PM IST
APPSC Group 2 Mains: చంద్రబాబుకు భారీ షాక్.. రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు

APPSC Group 2 Mains Exams: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలు తీవ్ర గందరగోళానికి దారి తీసింది. నిరుద్యోగులు వాయిదా కోసం పట్టుబట్టగా ప్రభుత్వం తీవ్ర చర్చలు జరిపింది. న్యాయ సలహా తీసుకుని వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ఏపీపీఎస్సీ బేఖాతరు చేసింది. యథావిధిగా గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించడం సంచలనం రేపింది. స్వయంగా సీఎం ఆదేశించినా కూడా కమిషన్‌ వాయిదా వేయకపోవడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Add Zee News as a Preferred Source

Also Read: YSRCP MLAs Entry Assembly: వైఎస్‌ జగన్‌ యూటర్న్‌..! అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం

గ్రూప్2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని రోజులు పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఆ లేఖపై ఏపీపీఎస్సీ ఇంతవరకు స్పందించలేదు. పరీక్ష వాయిదా పడిందని విస్తృతంగా ప్రచారం జరగడంతో ఏపీపీఎస్సీ సంచలన ప్రకటన చేసింది. 23వ తేదీన జరిగే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రకటించింది. పరీక్షలు వాయిదా అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది.

Also Read: APPSC Group 2 Mains: ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా.. గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచింది. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఏర్పాట్లు ఇలా..
ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్స్​ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనుండగా.. 92 వేల 250 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News