Thiruvuru TDP Leaders: ఆంధ్రప్రదేశ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు భారీ షాక్ తగిలింది. సొంత తెలుగుదేశం పార్టీ నాయకులే అతడిపై తిరుగుబాటు ఎగురవేశారు. 'ఈ ఎమ్మెల్యే మాకొద్దు' అంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో అతడి సొంత నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ నాయకులు ఒక చోటకు చేరారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా వారు గ్రూపుగా మారారు. ఈ పరిణామం తిరువూరు నియోజకవర్గంతోపాటు టీడీపీలో కలవరం రేపుతోంది.
Also Read: YS Sharmila: 'మోదీ, బాబు, జగన్, పవన్ కలిసి ఏపీకి తీరని ద్రోహం': వైఎస్ షర్మిల
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున కొలికపూడి శ్రీనివాస్ గెలిచిన విషయం తెలిసిందే. అతడు గెలవడంతోపాటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రెచ్చిపోతున్నారు. అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ నాయకులను పట్టించుకోకుండా.. వారికే వ్యతిరేకంగా పనులు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: YS Sharmila: 'వైఎస్ అవినాశ్ రెడ్డి జైలులో ఉండాలా? బయట ఉండాలా?'
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తిరువూరు టీడీపీ నాయకులు అతడిపై తిరుగుబాటు ఎగురవేశారు. తిరువూరులోని నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా 4 మండలాల నాయకులు సమావేశమయ్యారు. ఏపీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న నాయకులకు సముచితం స్థానం, గౌరవం, గుర్తింపు ఎమ్మెల్యే ఇవ్వడం లేదని పార్టీ నాయకులు వాపోయారు. ఎమ్మెల్యేకు ఉన్న అధికారాలు కట్టడి చేసి పార్టీ ఇన్‌చార్జ్‌గా మరొకరికి అవకాశం కల్పించాలని టీడీపీ నాయకులు తీర్మానించారు. 20 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచిందనే సంతోషం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుతో ప్రతిరోజు అవమానాలు ఎదుర్కొంటునే ఉన్నామని సమావేశంలో నాయకులు చర్చించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా పార్టీ కార్యకర్తలు పూర్తిగా నిస్తేజంగా ఉన్నారని వాపోయారు.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తిరువూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ప్రకటించారు. లేదంటే పార్టీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని పార్టీ అధిష్టానానికి హెచ్చరిక జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









