Big Shock To YS Jagan: జనసేనలోకి పెండెం దొరబాబు.. పవన్‌ కల్యాణ్‌ 'ఒక్క దెబ్బకు రెండు పిట్టలు'

Pawan Kalyan Master Stroke To YS Jagan And SVSN Varma: రాజకీయాల్లో రాటుదేలుతున్న పవన్‌ కల్యాణ్‌ భారీ వ్యూహం పన్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు నాయకులకు భారీ చెక్‌ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 7, 2025, 07:07 PM IST
Big Shock To YS Jagan: జనసేనలోకి పెండెం దొరబాబు.. పవన్‌ కల్యాణ్‌ 'ఒక్క దెబ్బకు రెండు పిట్టలు'

Pawan Kalyan Strategy: ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడిని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిజం చేశారు. రాజకీయంగా తీసుకున్న ఒక నిర్ణయంతో ఒకేసారి ఇద్దరు నాయకులకు చెక్‌ పెట్టారు. అంతేకాకుండా తనను తాను.. తన నాయకత్వాన్ని పవన్‌ కల్యాణ్‌ బలపర్చుకుంటున్నాడు. ఈ వ్యవహారంతో ప్రత్యర్థితోపాటు ఇతరులకు భారీ షాక్‌ తగిలింది. ఈ పరిణామంతో పవన్‌ కల్యాణ్‌ మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చారు.

Add Zee News as a Preferred Source

Also Read: Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట.. బెయిల్‌ మంజూరు

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరికతో పవన్‌ కల్యాణ్‌ ఒకే దెబ్బకు రెండు పిట్టల మాదిరి వ్యూహం పన్నారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మతోపాటు వైఎస్సార్‌సీపీకి ఊహించని దెబ్బను పవన్‌ కల్యాణ్‌ తీశారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీలో చేర్చుకున్నారు. పిఠాపురంలో తనకు తిరుగులేదని నిరూపించుకునేందుకు పవన్‌ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

Also Read: Nara Lokesh Counter: 'అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే మాజీ సీఎం వైఎస్ జగన్'

పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాకతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు షాక్‌ ఎదురైంది. చిరకాల ప్రత్యర్థిగా ఉన్న దొరబాబును జనసేనలోకి ఆహ్వానించడంపై వర్మ వర్గం మండిపడుతోంది. పవన్‌ కల్యాణ్‌ పారిన వ్యూహంలో తనపైనే అని వర్మ వాపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని అలకలో ఉన్నారు. పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా పవన్‌ కల్యాణ్‌ తనను తాను నిలదొక్కుకోవాలని.. పిఠాపురంలో పాతుకుపోవాలని సరికొత్త వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. పెండెం దొరబాబును ఆహ్వానించడం ద్వారా పవన్‌ కల్యాణ్‌ వర్మతోపాటు వైఎస్సార్‌సీపీకి గట్టి సందేశం ఇచ్చారు.

జనసేన పార్టీలోకి పెండెం దొరబాబు, అతడి కుటుంబసభ్యులు చేరడంతో జనసేన పార్టీ బలోపేతం కానుంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేగా పిఠాపురంలో తిరగలేకపోతున్నారు. పిఠాపురానికి దూరంగా ఉండడంతో నియోజకవర్గ బాధ్యతలు చూసుకునేందుకు దొరబాబును పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. దొరబాబు జనసేన పార్టీలోకి రావడంతో పిఠాపురంలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పని చేస్తుండగా దొరబాబు రాకతో మరో పార్టీ చేరినట్లుగా మారింది. మరి వ్యవహారం ఎటువైపు తీసుకెళ్తుందో తెలియడం లేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News