Sharmila Meeting Boycott: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహార శైలిపై సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. షర్మిల తీరుతో సొంత పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ అసంతృప్తి తిరుపతి పర్యటనలో బట్టబయలైంది. షర్మిలకు వ్యతిరేకంగా మహిళా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆమె వచ్చాక పార్టీలో సీనియర్ నాయకులకు గౌరవం లేదని.. మాజీ ఎంపీలను కూడా గౌరవించడం లేదని ఆరోపిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో తిరుపతి సభ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. పెండింగ్ బిల్లులన్నీ క్లియర్
తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తిలో సోమవారం వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సమయంలో మాజీ ఎంపీ చింతా మోహన్‌కు సక్రమంగా గౌరవం లభించలేదని పార్టీ శ్రేణులు వాపోయాయి. షర్మిల వ్యవహార శైలి బాగాలేదని.. పార్టీలో గుర్తింపు లేకుండా వ్యవహరిస్తున్నారని నాగలాపురం చెందిన మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ మహిళలు తెలిపారు. షర్మిల అధ్యక్షురాలైన తర్వాత పార్టీలో సీనియర్లకు గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీలు కూడా కింద కూర్చోబెట్టి అవమానించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలా అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదని వాపోయారు. షర్మిల తీరుకు నిరసనగా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి మహిళా నాయకులు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా షర్మిలకు వ్యతిరేకంగా బహిరంగంగా నిరసన వ్యక్తం చేయడం మరోసారి కావడం గమనార్హం.
Also Read: YS Sharmila: రూ.5 కోట్లు.. రూ.10 కోట్లు ఇచ్చి వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలి: వైఎస్ షర్మిల
సమీక్ష సమావేశంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పార్టీలో విబేధాలపై నోరుమెదపలేదు. తన తీరుపై నిరసన వ్యక్తం చేశారనే వార్త తెలిసినా కూడా వాటిపై స్పందించలేదు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై షర్మిల తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నద కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రకటించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమిలో చేరి మద్దతు పలుకుతుంటే.. మోడీ దత్తపుత్రుడుగా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రజా సమస్యల కన్నా.. రాష్ట్ర అభివృద్ధి కన్నా మోదీని మోయడమే మిన్నగా మారిందని ఆరోపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









