Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు రావడం కష్టంగానే మారింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున విజయం సాధించిన వల్లభనేని వంశీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మారారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, ఆయన కుమారుడిపై పరుష పదజాలంతో వంశీ విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలను దాటి వ్యక్తిగత విమర్శలు చేశారు వంశీ. ముఖ్యంగా నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నారు.
Also Read: AP Cabinet Decisions: ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఊతం.. పలు సంస్థలకు ఏపీ కేబినెట్ స్థలాల కేటాయింపు
ఆ తర్వాత క్షమాపణలు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసిన వంశీ ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వల్లభనేని వంశీకి కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, భూకబ్జా కేసు, ఎస్సీ/ఎస్టీ కేసు ఇలా వంశీపై పలు కేసులు నమోదయ్యాయి. వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా.. ఐదు కేసుల్లో బెయిల్ దక్కింది. అయినప్పటికీ ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో కేసులో వంశీకి బెయిల్ రావాల్సి ఉంది. ఈ కేసులో కూడా బెయిల్ దక్కితే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: YS Jagan: ఏపీలో భారీ పొలిటికల్ బాంబ్.. లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ అరెస్ట్ పక్కా?
అయితే తాజాగా వంశీపై మరో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. నియోజకవర్గంలో నకిలి ఇళ్లా పట్టాలిచ్చారని వంశీపై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పుడు ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐర్ నమోదు అయితే, ఆయనపై మరో కేసు నమోదైనట్టే. ఈ కేసులో కూడా ఆయన విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. వంశీ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా అయినా బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరుఫున న్యాయవాదులు కోర్టుకు విన్నవిస్తున్నారు. మరోవైపు వంశీ లేకపోవడంతో గన్నవరం వైసీపీ శ్రేణులు ఢీలా పడ్డారు. నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపే నాయకుడు లేకపోవడంతో వైసీపీ క్యాడర్ ఇబ్బంది పడుతుంది. మరి ఈ సమస్యకు వైసీపీ అధిష్టానం ఎలాంటి పరిష్కరం చూపుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter