Big Tragedy in cm Chandrababu naidu birthday celebrations in Kurnool: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినవేడుకల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అయితే.. ముఖ్యంగా పలు చోట్ల అన్నదానాలు, ఆస్పత్రులలో పళ్లపంపిణి, రక్త దానాలు వంటి ప్రొగ్రామ్ లను టీడీపీ శ్రేణులు నిర్వహించారు.
అయితే.. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఫారెన్ టూర్ లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో సైతం భారీ ఎత్తున నేతలు కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు కోసం పలు జిల్లాలో కార్యకర్తలు ర్యాలీనలు కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా.. కర్నూలు జిల్లాలో జరిగిన చంద్రబాబు బర్త్ డే వేడుకల్లో అనుకొని ఘటన చోటుచేసుకుంది.
ఆలురులో చంద్రబాబు కోసం.. జిల్లా యూత్ ప్రతినిధి బోయ సురేంద్ర ప్రత్యేకంగా బైక్ లతో ర్యాలీ నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో బోయ సురేంద్ర ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు ఆస్పత్రికి తరలించారు. వెంటనే టెస్ట్ లు చేసిన వైద్యులు అప్పటికే ప్రాణాలు పోయాయని చెప్పారు.
గుండెపోటు వచ్చిందని చెప్పారు. దీంతో కర్నూల్ జిల్లా నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎంతో వేడుకగా ఉదయం నుంచి పలు కార్యక్రమాలునిర్వహించిన నేత ఇప్పుడు లేడని ఆ వార్త వినగానే జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు కన్నీళ్లు ఆస్పత్రికి పలుగులు పెట్టారు.
Read more: Tirumala: తిరుమలలో వేసవి రద్దీ వేళ.. వీఐపీ సిఫార్సు లేఖల తిరస్కరణ?
ముఖ్యంగా ఆది నుంచి బోయ సురేంద్ర టీడీపీ అంటే ప్రాణాలు ఇచ్చేవాడు.అలాంటి ఆయన అభిమాన నేత జన్మదినంరోజున మరణించడం మాత్రం బాధకరమని నేతలు అంటున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తునకార్యకర్తలు,నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. బోయ సురేంద్ర ఆత్మకు శాంతికల్గాలని ప్రార్థిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









