Aghori Trapped: వశీకరణంతో అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన అఘోరీ? లైంగిక వాంఛ కోసమా?

Big Twist In Aghori Case Trapped A Young Women: సినిమాల్లో చూసినట్టు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా వశీకరణ చేసుకుని ఓ యువతిని ఎత్తుకెళ్లిందనే వార్త ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతోంది. యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 26, 2025, 05:46 PM IST
Aghori Trapped: వశీకరణంతో అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన అఘోరీ? లైంగిక వాంఛ కోసమా?

Aghori Kidnap: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్‌చల్‌ చేస్తోంది. ఆమె ఎక్కడ పర్యటించినా వివాదమవుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ ఆమె నగ్నంగా కారులో తిరుగుతూ ఇబ్బందులు సృష్టిస్తుండడంతో ఎక్కడికక్కడ ఆమెపై నిర్బంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించి మరో వివాదం తీవ్ర రచ్చ రేపుతోంది. ఓ అమ్మాయిని కిడ్నాప్‌ చేసిందని.. వశీకరణం చేసుకుని తన వెంట తీసుకెళ్లిందని.. లైంగిక వాంఛ తీర్చుకోవడానికి ఇలా చేసిందని వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆ యువతి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తూ తమ కుమార్తెను రక్షించాలని కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Papavinasanam Dam: పాపవినాశనం డ్యాంలో బోటింగ్‌పై టీటీడీ మాజీ చైర్మన్‌ ఆగ్రహం

అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతుర్ని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడని ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య ఆరోపించారు. ఈ మేరకు అఘోరీపై మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ కూతురు ఇంజనీరింగ్ చదువుతోందని.. నాలుగు నెలల కిందట లేడీ అఘోరిని చూసిందని ఆమె తండ్రి తెలిపాడు. మంగళగిరిలో జాతీయ రహదారి మీద ఒంటి మీద బట్టలు లేకుండా అఘోరీ హల్‌చల్ చేస్తుంటే అమ్మాయి దుస్తులు ఇచ్చింది. పోలీస్ విజ్ఞప్తి మేరకు అఘోరీకి దుస్తులు కప్పింది.

Also Read: Pastor Praveen: పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.. విచారణ చేయాలని డిమాండ్‌

దుస్తులు కప్పి.. పోలీసు వాహనంలో అఘోరీ ఎక్కించేందుకు కుమార్తె సహకరించిందని.. ఆ సమయంలోనే అఘోరీతో పరిచయమైందని యువతి తండ్రి వివరించాడు. ఆ సమయంలోనే అఘోరీ తన కుమార్తె ఫోన్ నంబర్ తీసుకొని తరచూ మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అనంతరం కొన్నాళ్లకు అఘోరీ మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండిందని చెప్పారు. తమ కూతురికి మాయమాటలతో మోసం చేసి ఆకు పసరుతో  లేపనాలు పూసి వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణిని చేస్తారని చెప్పిందని యువతి తండ్రి కోటయ్య వెల్లడించాడు. తన కూతుర్ని పూర్తిగా తనవైపు తిప్పుకుని ఎత్తుకెళ్లిపోయాడని ఆరోపించాడు.

ఇప్పుడు తమ అమ్మాయి అఘోరీ భ్రమలో లేదని.. అక్కడే ఉంచితే తమ అమ్మాయి ప్రాణానికి ప్రమాదమని యువతి తండ్రి కోటయ్య విలపించాడు. తమ కుమార్తెను అఘోరి  నుంచి కాపాడి తమకు అప్పగించాలని తల్లిదండ్రులు  ప్రాధేయపడుతున్నారు. ఈ విషయమై పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అఘోరి ఎక్కడ ఉండేది తెలియదని.. ఆమె ఆచూకీ కనిపెట్టడం కష్టంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసినా కూడా అఘోరీపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News