Pastor Praveen Death: పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. మద్యం తాగి బుల్లెట్ నడిపాడా?

Big Twist In Pastor Praveen Death Case Here What Is: తీవ్ర సంచలనం సృష్టించిన పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మద్యం ప్రస్తావనకు రావడం కలకలం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 30, 2025, 10:58 PM IST
Pastor Praveen Death: పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. మద్యం తాగి బుల్లెట్ నడిపాడా?

Pastor Praveen Death Case: పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపగా.. ఈ కేసుపై పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఈ క్రమంలో హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్‌ పరిశీలించగా.. మద్యం ప్రస్తావనకు రావడం కలకలం రేపుతోంది. పాస్టర్‌ మద్యం దుకాణానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి కాకుండా రెండుసార్లు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కీలక అప్‌డేట్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Panchanga Sravanam on Ys Jagan: భయమెరుగని వైఎస్ జగన్, విజయం ఖాయం అంటున్న పంచాంగం

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసును పోలీస్‌ శాఖ సవాల్‌గా తీసుకున్న విచారణ చేపడుతోంది. రాజకీయంగా కూడా తీవ్ర రచ్చగా మారిన ఈ కేసులో వాస్తవాలు త్వరితగతిన ఛేదించాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విచారణ క్రమంలో కీలకమైన సీసీ టీవీ ఫుటేజ్ లభించింది. అతడు మృతి చెందడానికి గంట 42 నిముషాల ముందు పాస్టర్‌ ప్రవీణ్ వైన్‌షాప్‌లో మద్యం కొనుగోలు చేయడం సంచలనం రేపుతోంది. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి వాహనం నడిపాడని చెప్పవచ్చు.

Also Read: TDP Foundation Day: ఆవిర్భావ దినోత్సవం రోజు చంద్రబాబు సంచలన ప్రకటన.. జగన్‌కు భారీ షాక్‌

మద్యం కొనుగోలు చేసిన తరువాత యూపీఐ పేమెంట్ చేసినట్టు సీసీ టీవీలో రికార్డ్‌ను పోలీసులు పరిశీలించారు. అంతకుముందు కోదాడ పరిసర ప్రాంతంలో ఒకసారి మద్యం కొనుగోలు చేసినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. ఇక ఏపీలోని ఏలూరు పరిసర ప్రాంతంలో కూడా మద్యం కొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా విచారణలో భాగంగా పాస్టర్ ప్రవీణ్ బ్యాంక్ ఖాతా, యూపీఐ యాప్స్ ఆధారంగా ఎక్కడ మద్యం కొనుగోలు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ కొన్ని కీలక వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. పాస్టర్‌ ప్రవీణ్‌ కేసును అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. 'హైదరాబాద్‌ నుంచి బుల్లెట్ బైక్‌పై రాజమండ్రికి పాస్టర్‌ ప్రవీణ్‌ వస్తుండగా ఆ సమయంలో అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతోపాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్‌ను దాటుకొని వెళ్లాయి' అని పోలీస్‌ శాఖ ప్రకటించింది.

రెడ్ కలర్ కారు ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ బైక్‌ ఒకేసారి వెళ్లడంతో ఏం జరిగిందనేది గుర్తించేందుకు అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి కారు కోసం విచారణ చేస్తున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్సైలతో ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది.ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసులో ఎవరి వద్ద అయినా బలమైన ఆధారాలు ఉంటే దర్యాప్తు బృందానికి అందించవచ్చుని పోలీస్‌ శాఖ సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News