TTD Darshan: తిరుమల ద‌ర్శ‌నాలపై వివాదం.. చంద్ర‌బాబుకి కొండా సురేఖ సంచలన లేఖ

Konda Surekha Wrote Letter To Chandrababu On Darshan Recommendation Letters: తిరుమల దర్శనాల అంశంపై సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన లేఖ రాశారు. మీరు ఆదేశించినా కూడా తిరుమల అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 11, 2025, 10:58 PM IST
TTD Darshan: తిరుమల ద‌ర్శ‌నాలపై వివాదం.. చంద్ర‌బాబుకి కొండా సురేఖ సంచలన లేఖ

Tirumala Darshan Recommendation Letter: తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాల అంశంపై తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఏపీ ప్రభుత్వం సిఫారసు లేఖలపై అనుమతి ఇస్తూ తీసుకున్న నిర్ణయంతో కొంత వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు చెబుతూ కొండా సురేఖ లేఖ పంపించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Posani Krishna Murali అన్ని కేసుల్లో పోసాని కృష్ణ మురళీకి బెయిల్.. రేపు జైలు నుంచి విడుదల?

టీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎం చంద్ర‌బాబుకి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. తిరుమల తిరుప‌తి వేంక‌టేశ్వ‌రుడి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి ప్రారంభించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సురేఖ‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులందరికీ  ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. వారంద‌రి తరఫున ధన్యవాదాలు ప్రకటించారు.

Also Read: Chandrababu: ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తే తాట తీస్తా: సీఎం చంద్రబాబు హెచ్చరిక

'తెలంగాణ నుంచి తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలుగు ప్రజల భక్తి.. తెలంగాణ ప్ర‌జ‌ల భ‌క్తి తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌రుడిపై తగ్గలేదు. ఇటీవ‌ల ఏపీ స‌ర్కారు ఇచ్చిన మార్గ‌ద‌ర్శకాల ప్ర‌కారం తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తిరుప‌తి దేవుడి దర్శనం కోసం సిఫార్సు లేఖలు ఇవ్వడానికి అనుమతించబడినందుకు సంతోషంగా ఉంది' అని లేఖలో కొండా సురేఖ తెలిపారు.

'టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలను సరిగ్గా పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రజాప్రతినిధులు, తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి భక్తులు ఇబ్బందులు ప‌డుతున్నారు' అని చంద్రబాబుకు లేఖలో కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. 'టీటీడీ అధికారులు తెలంగాణ భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంపై తీవ్ర గందరగోళం నెల‌కొంది' అని చంద్ర‌బాబు దృష్టికి మంత్రి సురేఖ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని వెంటనే ప్ర‌త్యేకంగా పరిశీలించి.. ఆ ఆదేశాలను సక్రమంగా పాటించేలా టీటీడీ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి' అని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాలి సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ కోరారు. ఈ విషయమై సత్వరమే చర్యలు తీసుకోవాలని లేఖలో మంత్రి సురేఖ‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News