NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పంపిణీ సమయవేళలు ప్రభుత్వం మార్చింది. పింఛన్ల పంపిణీలో నాణ్యతను.. పింఛన్‌దారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికితోడు పింఛను పంపిణీ మొబైల్ అప్లికేషన్‌లో మార్పులు చేశారు.
Also Read: Amavasya: అమావాస్య తర్వాత వెనక్కి వెళ్లిన 'సముద్రం'.. నెలలో మూడుసార్లు దేనికి సంకేతం?
సమయవేళలు ఇవే
గతంలో వేకువజామున 4, 5 గంటల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభించేవారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే సమయానికి ప్రజల వద్దకు వెళ్లి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పింఛన్లు పంపిణీ చేశారు. తాజాగా సమయం మారడంతో ఉదయం 7 గంటల నుంచి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేశారు. ప్రజలు నిద్రలేచిన తర్వాత పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధుల షెడ్యూల్ కూడా మారింది.
Also Read: Inter Exams: రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు ఇవి తెలుసుకున్నారా?
ప్రభుత్వం తెల్లవారుజామునే పంపిణీ చేయాలని లక్ష్యం ఏమీలేదు. కానీ వేకువజామునే పింఛన్ పంపిణీతో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులతోపాటు లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు. వారి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఇకపై ప్రతి నెలా ఉదయం 7 గంటలకు పింఛన్ పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించింది. ఉదయం 7 గంటలకు మాత్రమే పింఛన్ పంపిణీ చేసే యాప్ పనిచేసేలా అవసరమైన మార్పులు చేశారు.
యాప్‌లో మార్పులు
లబ్ధిదారుల ఇళ్ల దగ్గర నుంచి 300 మీటర్లలోపే పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆస్పత్రుల్లో ఉన్నవారు, వృద్ధాశ్రమాలు, స్కూల్స్, కాలేజీల్లో, దివ్యాంగ విద్యార్థులకు, ఉపాధి హామీ పని ప్రదేశంలో, బంధువుల ఇళ్ల దగ్గర పింఛను పంపిణీ చేసినా నమోదుకు వారికి అవకాశం ఇచ్చారు. పింఛన్ తీసుకునే లబ్ధిదారుల కోసం మెసేజ్‌ను తెలిపేందుకు యాప్‌లో 20 సెకన్ల ఆడియోని ప్లే చేయనున్నారు. ఆ యాప్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన తర్వాత ఆ ఆడియో ఆటోమెటిక్‌గా ప్లే కానుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ప్రభుత్వం సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









