)
Smart Ration Cards: ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులపై కీలక అప్డేట్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తామే ఇంటింటికి వచ్చి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు సంక్షేమంతో పాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో ఆగస్టు 25వ తేదీ నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు ఏపీ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
కృష్ణా జిల్లా కానూరులోని సివిల్ సప్లైస్ భవన్లో శుక్రవారం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులను నాలుగు దశల్లో పంపిణీ చేస్తామని చెప్పారు. కోటి 45 లక్షల స్మార్డ్ కార్డుల పంపిణీ ఆయా రేషన్ కార్డుల దుకాణాల వద్దనే గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో పంపిణీ చేస్తామని వివరించారు. 6,71,000 కొత్త రేషన్ కార్డులు జారీతోపాటు 16,67,032 రేషన్ కార్డు దరఖాస్తులకు ఆమోదం ఇచ్చామని వెల్లడించారు.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని.. రేషన్ పంపిణీ 93 శాతానికి పెరిగిందని తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు సాంకేతికతను ఉపయోగించి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్మార్ట్ కార్డుల్లో ప్రభుత్వ చిహ్నంతోపాటు కుటుంబసభ్యుల వివరాలు, సేఫ్టీ కోసం క్యూఆర్ కోడ్, కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుందని నాదెండ్ల మనోహర్ వెల్లించారు. టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చని చెప్పారు.
ప్రతి నెలా దివ్వాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన దాదాపు 16,73,000 మందికి రేషన్ కార్డులను డోర్ డెలివరీ చేసినట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆగస్టు 25 నుంచి 9 జిల్లాల నుంచి ఉచిత స్మార్ట్ కార్డుల పంపిణీని ఆయా జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ వాతావరణంలో ప్రారంభిస్తారని వెల్లడించారు.
మొదటి విడత
ఆగస్టు 25 నుంచి ఈ జిల్లాల్లో..
విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు
రెండో విడత
ఆగస్టు 30వ తేదీ నుంచి ఈ జిల్లాల్లో
చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు
మూడో విడత
సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఈ జిల్లాల్లో
అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి
నాలుగో విడత
సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ జిల్లాల్లో
బాపట్ల, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.